నమీబియా విజయం.. గుర్తుపెట్టుకోండి అంటూ.. సచిన్ పోస్ట్?

praveen
నిన్నటి నుంచి క్రికెట్ ప్రేక్షకులందరూ ఎదురుచూస్తున్న టి20 ప్రపంచక ప్రారంభమైంది. అయితే ఇక ఈ ప్రపంచకప్ టోర్నీలో భాగంగా మొదటి మ్యాచ్ లోనే సంచలనం నమోదయింది అని చెప్పాలి. ఇప్పటివరకు పలుమార్లు వరల్డ్ కప్ విజేతగా నిలిచిన శ్రీలంక జట్టుకూ ఒక్కసారి కూడా వరల్డ్ కప్ గెలవని కనీసం అంతర్జాతీయ క్రికెట్లో గొప్పగా ప్రస్తానాన్ని కొనసాగించని పసుకూన నమీబియా జట్టు ఊహించని షాక్ ఇచ్చింది. ఏకంగా పటిష్టమైన శ్రీలంక జట్టుపై 55 పరుగుల తేడాతో విజయం సాధించి ఇక టి20 వరల్డ్ కప్ లో భాగంగా బోనీ కొట్టింది అని చెప్పాలి.


 అయితే ఈ మ్యాచ్ ప్రారంభమైన సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఒక్కటే అనుకున్నారు. పసుకూన నమీబియా పై శ్రీలంక జట్టు ఎంతో అలవోకగా విజయం సాధిస్తుంది అని భావించారు. ఎందుకంటే ఎంతో పటిష్టంగా ఉన్న శ్రీలంక జట్టు మొన్నటికి మొన్న ఆసియా కప్ లో కూడా విజేతగా నిలిచింది అన్న విషయం తెలిసిందే. దీంతో ఇక శ్రీలంక విజయం ఖాయం అనుకొని భావించారు. కానీ ఊహించని రీతిలో పసుకూన నమీబియా  వీరోచిత పోరాటం చేసింది. సాదాసీదా విజయం కాదు 55 పరుగుల తేడాతో శ్రీలంకపై గ్రాండ్ విక్టరీ సొంతం చేసుకుంది.


 ఈ క్రమంలోనే శ్రీలంకను ఓడించిన పసుకూన నమీబియా  జట్టుపై ఎంతో మంది మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు అని చెప్పాలి. ఇక ఇటీవలే ఇదే విషయంపై అటు భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కూడా స్పందిస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ కాస్త వైరల్ గా మారిపోయింది. గుర్తుపెట్టుకోండి.. నమీబియా ఇటీవల విజయంతో ప్రపంచ క్రికెట్కు ఒక సందేశం పంపింది అంటూ సచిన్ టెండూల్కర్ చేసిన కామెంట్ కాస్త వైరల్ గా మారింది. ఇక సచిన్ టెండూల్కర్ పోస్ట్ పై ఎంతోమంది నేటిజన్లు స్పందిస్తూ లైకులు కొట్టేస్తున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: