కోహ్లీ నీ టైం అయిపోయింది ఇక వెళ్ళిపో.. విరాట్ రిప్లై అదుర్స్?

praveen
భారత క్రికెట్లో విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . ఒకప్పుడు కెప్టెన్గా జట్టుకు ముందుకు నడిపించిన విరాట్ కోహ్లీ ఆటగాడిగా కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇప్పటివరకు ఎంతోమంది దిగ్గజా క్రికెటర్లు సాధించిన రికార్డులను సైతం అలవోకగా చేదించి తనకు తిరుగులేదు అని నిరూపించుకున్నాడు. నేటి జనరేషన్ క్రికెటర్లలో ఎంతోమంది కోహ్లీ తో పాటు క్రికెట్ ప్రస్తానాన్ని కొనసాగిస్తున్న ఆటగాళ్లు కోహ్లీ సాధించిన రికార్డులకు మాత్రం చాలా దూరంలోనే ఉన్నారు అని చెప్పాలి.

 ఒక వైపు తండ్రి చనిపోయిన సమయంలో కూడా మరోవైపు క్రికెట్ వదలకుండా మ్యాచ్ ఆడాడు విరాట్ కోహ్లీ. దీన్ని బట్టి అతని ప్రొఫెషనలిజం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇక మరికొన్ని రోజుల్లో టి20 వరల్డ్ కప్ లో టీమిండియా ప్రస్థానాన్ని మొదలుపెట్టబోతుంది. ఇలాంటి సమయంలో ఇక జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ లో తల మునకలైపోతున్నాడు.  అద్భుతమైన ప్రదర్శన చేసి టీమిండియా కు వరల్డ్ కప్ అందించాలని ప్రాక్టీస్ లో తెగ చెమటోడుస్తున్నాడు అని చెప్పాలి. ఇందుకు సంబంధించిన ఒక వీడియో ట్విట్టర్లో తెగ చక్కర్లు కొడుతుంది.

 విరాట్ కోహ్లీ నెట్స్ లో సీరియస్ గా ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో కోహ్లీ కోచింగ్ స్టాఫ్ ఒకరు విరాట్ కోహ్లీ నీ టైం అయిపోయింది ఇక వెళ్ళవచ్చు అంటూ చెప్పాడు. ఇందుకు స్పందించిన విరాట్ కోహ్లీ దీపక్ హుడా వచ్చిన తర్వాత నేను వెళ్తాను అంటూ రిప్లై ఇచ్చాడు. ఇక దీపక్ కూడా వచ్చేంతవరకు కూడా ప్రాక్టీస్ లో మునిగిపోయిన విరాట్ కోహ్లీ.. ఇక హుడా వచ్చిన తర్వాతే నెట్స్ నుంచి నిష్క్రమించాడు అని చెప్పాలి.  ఈ వీడియో ట్విటర్ లో వైరల్ గా మారగా.. స్పందించిన అధికారులు అది మరి మా కోహ్లీ అంటే ఆటపట్ల అంత అంకితభావం ఉంది అంటూ కామెంట్ చేస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: