పాకిస్తాన్తో మ్యాచ్.. పంత్ కు నో ఛాన్స్.. కారణం?
ఇకపోతే అటు టీమిండియా మాత్రం ఈ నెల 23వ తేదీన చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్తో తొలి మ్యాచ్ ఆడబోతుంది అని చెప్పాలి. అయితే గత ఏడాది టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ చేతిలో ఘోర ఓటమి చవిచూసింది భారత జట్టు. ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోపాకిస్తాన్ పై విజయం సాధించి ప్రతీకరం తీర్చుకోవాలని భావిస్తుంది. ఈ క్రమంలోనే మంచి ఫామ్ లో ఉన్న ఆటగాళ్లను మాత్రమే తుది జట్టులోకి తీసుకునేలా ప్లానింగ్ సిద్ధం చేసుకుంటుంది. ఇలాంటి పరిస్థితులను ఇక జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు పాకిస్తాన్తో మ్యాచ్లో చోటు దక్కడం కష్టమే అన్నది తెలుస్తుంది.
ఎందుకంటే ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టకముందు దక్షిణాఫ్రికా తో జరిగిన టి20 సిరీస్ లో పంత్ విఫలమయ్యాడు. వెస్ట్రన్ ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన ప్రాక్టీస్ లో కూడా రెండు మ్యాచ్లలో కలిపి 18 పరుగులు చేసి నిరాశపరిచాడు. అందుకే అతని స్థానంలో దినేష్ కార్తీక్ ను తీసుకోవాలని జట్టు యాజమాన్యం భావిస్తుందట. జట్టులో చోటు సంపాదించుకున్న కార్తిక్ తన పాత్రకు పూర్తి న్యాయం చేస్తున్నాడు. ఈ ఏడాది 181 బంతులలో 150.82 స్ట్రైక్ రేట్ తో 273 పరుగులు సాధించాడు. ఇక ప్రతి మ్యాచ్ లో కూడా ఎక్కడ నిరాశపరచకుండా సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోతూ ఉన్నాడు. అతని క్రీజులో ఉండేది కాసేపు అయినప్పటికీ విధ్వంసం సృష్టిస్తున్నాడు అని చెప్పాలి. అందుకే పాకిస్తాన్తో మ్యాచ్లో అతనికి చోటు దక్కుతుంది అన్నది తెలుస్తుంది.