రోహిత్ కెప్టెన్సీ లో ఇండియా 15 ఏళ్ళ తర్వాత సాధించేనా ?
అప్పటి నుండి మొన్న జరిగిన 2021 కప్ వరకు కెప్టెన్ లు మారినా ఇండియా అభిమానుల ఆశ మాత్రం నెరవేరలేదు. కాబట్టి ఇప్పుడు మొదలు కానున్న వరల్డ్ కప్ ను ఇండియా టీం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. టీం ఎంపిక విషయంలోనూ చాలా జాగ్రత్తగా అడుగులు వేసింది. ఈ మధ్య జరిగిన సిరీస్ లను బట్టి చూస్తే ఇండియా మంచి జోరుమీదనే ఉన్నది అని తెలుస్తోంది. కానీ కీలకం అయిన మ్యాచ్ లలో ఏ విధంగా ఆడుతుంది అన్నది ఎవ్వరూ ఊహించలేము. తాజాగా రోహిత్, రాహుల్, కోహ్లీ మరియు సూర్య కుమార్ యాదవ్ లు ఫామ్ లోకి రావడం ఇండియాకు శుభపరిణామం అని చెప్పాలి.
ఇండియా టీం ను మరియు అభిమానులను గత 15 సంవత్సరాలుగా ఊరిస్తూ ఉన్న టీ 20 వరల్డ్ కప్ కల ఈ సారైనా నెరవేరుతుందా ? టీం లో ఉన్న సభ్యులు అందరూ సమిష్టిగా ఆడి మరో టీ 20 వరల్డ్ కప్ ను అందిస్తారా చూడాలి. ఇక ఈ కప్ కు మెయిన్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా దూరం కావడం పెద్ద మైనస్ అని చెప్పాలి .