వారెవ్వా.. భారత్ - పాకిస్తాన్ మ్యాచ్.. ఇప్పుడు థియేటర్లలో?

praveen
సాధారణంగా భారత్ పాకిస్తాన్ మ్యాచ్ వస్తుందంటే చాలు ఇక అటు అంతర్జాతీయ క్రికెట్ లో ఉండే సందడి అంతా ఇంతా కాదు. కేవలం ఇరుదేశాల క్రికెట్ ప్రేక్షకులు మాత్రమే కాదు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ను కన్నార్పకుండా చూస్తూ ఉంటారు అని చెప్పాలి. ఆ రేంజ్ లో దాయాదుల పోరుకు క్రేజ్ ఉంటుంది. దశాబ్దాలు గడుస్తున్న ఈ క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇకపోతే మరికొన్ని రోజుల్లో వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది. వరల్డ్ కప్ లో భాగంగా ఈనెల 23వ తేదీన భారత్, పాకిస్తాన్ మధ్య ఉత్కంఠ భరితమైన పోరు జరగబోతుంది.


 నువ్వా నేనా అన్నట్లుగా జరిగే ఈ పోరులో ఎవరు విజయం సాధిస్తారు అనే విషయంపై ఇప్పటికే ఎంతో మంది విశ్లేషకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ఆస్ట్రేలియా వేదికగా జరుగుతూ ఉండడంతో అందరికీ స్టేడియం కు వెళ్లి చూసే అవకాశం లేకపోవచ్చు. ఈ క్రమంలోనే కొంతమంది పెద్ద తెరలను ఏర్పాటు చేసుకొని మ్యాచ్ వీక్షించడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. కానీ అలాంటిది భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఏకంగా థియేటర్లలో వస్తే ఎలా ఉంటుంది. థియేటర్లలో ఈ మ్యాచ్ చూస్తే ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేం అంటారు క్రికెట్ అభిమానులు.



 ఈ క్రమంలోని ఇప్పుడు ఇది నిజం కాబోతుంది అన్నది తెలుస్తుంది. ప్రేక్షకులు ఎవరు కలలో కూడా ఊహించని రీతిలో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ థియేటర్లలో ప్రత్యక్ష ప్రసారం కాబోతుంది అన్నది తెలుస్తుంది.. అయితే కేవలం భారత్ పాకిస్తాన్ మధ్య జరగబోయే మ్యాచ్ మాత్రమే కాదు టి20 వరల్డ్ కప్ లో భారత్ ఆడబోయే  ప్రతి మ్యాచ్ ని కూడా థియేటర్లో చూసే అవకాశం రాబోతుంది. ఈ మేరకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తో ఐనాక్స్ సంస్థ ఒప్పందం చేసుకుంది. దేశవ్యాప్తంగా 20 కి పైగా ఐనాక్స్ థియేటర్లలోప్రపంచ కప్ లో భాగంగా టీమిండియ ఆడే ప్రతి మ్యాచ్ ని కూడా ప్రత్యక్ష ప్రసారం చేయబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: