బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా.. రాబోతుంది ఎవరో తెలుసా?
అయితే ఇలా ప్రస్తుతం భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడిగా కొనసాగుతున్న సౌరబ్ గంగూలీ మరికొన్ని రోజుల్లో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టబోతున్నాడు అంటూ గత కొన్ని రోజులుగా ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి అని చెప్పాలి. అయితే ఇక ఈ వార్తల్లో నిజం లేదని ఐసిసి చైర్మన్ అవ్వడం అంటే అంత సులభం కాదు అంటూ పలుమార్లు సౌరబ్ గంగూలీ స్పందించాడు. ఏది ఏమైనా అటు బిసిసిఐ అధ్యక్షుడిగా సౌరబ్ గంగూలీ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో కొత్తగా రాబోయే బీసీసీఐ అధ్యక్షుడు ఎవరు అన్న విషయంపై చర్చ జరుగుతుంది అన్నది తెలిసిందే.
ఇటీవల ఇదే విషయంపై ఒక ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. సౌరబ్ గంగూలీ బిసిసిఐ ప్రెసిడెంట్ పదవి నుంచి తప్పుకోనున్నాడని వచ్చిన వార్తలు నిజమయ్యేలా కనిపిస్తూ ఉన్నాయి. సౌరబ్ గంగూలి స్థానంలో మాజీ టీమ్ ఇండియా క్రికెటర్ రోజర్ బిన్నీ బీసీసీఐ చైర్మన్ గా నియామకం కానున్నట్లు తెలుస్తోంది. అయితే భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శిగా మాత్రం జై షా కొనసాగనన్నాడట. ఇందుకు సంబంధించిన వార్తలు వైరల్ గా మారిపోగా దీనిపై అటు బీసీసీఐ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.