కోహ్లీ ది బెస్ట్.. రమిజ్ రజా ఫ్రస్టేషన్ లో ఉన్నాడు : సల్మాన్

praveen
గత కొంతకాలం నుంచి పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజాంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. బాబర్ అజాం పరుగులు చేస్తున్న అతని స్ట్రైక్ రేట్ మాత్రం రోజురోజుకు పడిపోతుందని మునుపటిలా దూకుడుగా ఆడటం లేదు అంటూ ఎంతో మంది విమర్శలు చేస్తున్నారు. మొన్నటికి మొన్న ఇంగ్లాండ్ తో జరిగిన టి20 సిరీస్ లో కూడా అతను సెంచరీ చేసిన స్ట్రైక్ రేట్ పడిపోవడం కారణంగా విమర్శలు ఎదుర్కొన్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవలే పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజాంపై వస్తున్న విమర్శలపై ఆ దేశ క్రికెట్ బోర్డు చైర్మన్  రమిజ్ రాజా స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.


 బాబర్ అజాం పై విమర్శలు చేయడం.. ఒక పనికిమాలిన చర్య అంటూ వ్యాఖ్యానించాడు. అదే సమయంలో ఆసియా కప్ లో బంగ్లాదేశ్ పై కోహ్లీ చేసిన సెంచరీని బాబర్ సెంచరీ తో పోల్చి చూసాడు. విరాట్ ఒక్క సెంచరీ చేస్తే అప్పటివరకు జరిగింది మొత్తం మరిచిపోయారు. కానీ బాబర్ పై మాత్రం విమర్శలు చేస్తున్నారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు  రమిజ్ రాజా. అయితే కోహ్లీతో బాబర్ కు పోలిక ఏంటి అంటూ అటు టీమిండియా అభిమానులు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేశారు. ఇక ఇప్పుడు ఇటీవల ఇదే విషయంపై స్పందించిన పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ ఏకంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమిజ్ రాజా పై విమర్శలు గుప్పించాడు.


 ఇటీవల టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ విషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమిజ్ రాజా చేసిన విమర్శలో ఏమాత్రం లాజిక్ లేదు అంటూ కౌంటర్ ఇచ్చాడు సల్మాన్ బట్. విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడు అంటూ ప్రశంసలు కురిపించాడు. ప్రపంచ క్రికెట్లో ఇప్పటివరకు విరాట్ కోహ్లీని పోలిన ఆటగాళ్లు ఎవరూ లేరు అంటూ వ్యాఖ్యానించాడు. ఇప్పటికే విరాట్ కోహ్లీకి అంతర్జాతీయ క్రికెట్ లో 70కి పైగా సెంచరీలు ఉన్నాయని.. ఈ రికార్డుకు ఎవరూ కూడా చేరువలో లేరు అంటూ గుర్తు చేశాడు సల్మాన్ బట్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: