
వన్డే ఫార్మాట్లో.. ఝలన్ గోస్వామి సాధించిన రికార్డులు ఇవే?
భారత మహిళల జట్టులో ఎన్నో ఏళ్లపాటు సేవలు అందించిన సీనియర్ బౌలర్ ఝలన్ గోస్వామి ఇటీవల తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఎంతో మంది ప్రస్తుత క్రికెటర్లు మాజీ క్రికెటర్లు కూడా స్పందిస్తూ ఆమె టీమిండియా తరుపున చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఉన్నారు అని చెప్పాలి. అంతేకాదు ఝలన్ గోస్వామి ఇప్పుడు వరకు అంతర్జాతీయ క్రికెట్లో సాధించిన ఎన్నో రికార్డులు కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉన్నాయి.
మరి ఇప్పటివరకు ఝలన్ గోస్వామి భారత తరఫున వన్డేల్లో సాధించిన రికార్డుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఇప్పుడు వరకు భారత మహిళల క్రికెట్లో 1000 పరుగులు చేసి 100 వికెట్లు తీసిన ఏకైక ప్లేయర్గా కొనసాగుతుంది.
ఇక ఆమె కెరియర్ లో 255 వికెట్లు సాధించింది. ఇక భారత మహిళా క్రికెట్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం.
ఝలన్ గోస్వామి కెరియర్లో అత్యుత్తమ ఘనంగాలు 6-31 గా ఉంది.
ఇక ఎక్కువసార్లు ఐదు వికెట్ల హాల్ (2) సాధించిన క్రికెటర్ గా కొనసాగుతోంది.
అంతేకాదు వన్డేలో పదివేల ఐదు బంతులు వేసింది ఝలన్ గోస్వామి.
ఇక 69 క్యాచ్ లతో ఎక్కువ క్యాచ్లు పట్టిన మహిళ క్రికెటర్గా రెండవ స్థానంలో ఉంది.
ఇక 250 వికెట్లు తీసిన ఏకైక బౌలర్ ఝలన్ గోస్వామి కొనసాగుతోంది.
అంతేకాదు 200 వన్డేలు ఆడిన రెండవ ప్లేయర్ కావడం గమనార్హం.