
ఆస్ట్రేలియా జట్టులో.. సింగపూర్ సిన్నోడు.. ఎలా రాణిస్తాడో?
సింగపూర్ లో జన్మించిన టీమ్ డేవిడ్ 2019లో తన సొంత దేశం తరఫున అంతర్జాతీయ క్రికెట్ లో ఆరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 14 టి20 మ్యాచ్ లు ఆడాడు. అయితే ఇప్పుడు లీగ్ క్రికెట్ లో టీమ్ డేవిడ్ చూపించిన పర్ఫామెన్స్ కి ఫిదా అయిన క్రికెట్ ఆస్ట్రేలియా సెలెక్టర్లు అతని జాతీయ జట్టులోకి తీసుకున్నారు. ఒక వైపు బ్యాటింగులో మరోవైపు బౌలింగులో కూడా మెరుగైన ప్రదర్శన చేయడంతో అతనికి లక్కీ ఛాన్స్ దక్కింది. కాగా ఆస్ట్రేలియా ఇండియా పర్యటనకు వచ్చింది. దీంతో భారత్ తో టి20 సిరీస్ ఆడుతుంది.
టీ20 సిరీస్ లో భాగంగా సింగపూర్ సిన్నోడు టీమ్ డేవిడ్ ఎలాంటి ప్రదర్శన చేయబోతున్నాడు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. మిచెల్ మార్ష్, మార్కస్ స్టోయినిస్ లాంటి స్టార్ ప్లేయర్లు దూరం కావడంతో ఆస్ట్రేలియా అంతర్జాతీయ జట్టులోకి యువ ఆటగాడు టీమ్ డేవిడ్ కు అవకాశం దక్కింది అని చెప్పాలి. అంతేకాదు టి20 వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన జట్టులో కూడా ఈ యువ ఆటగాడు స్థానం సంపాదించుకోవడం గమనార్హం. ఇకపోతే ఐపీఎల్లో ఇతన్ని 8.23 కోట్లు పెట్టి కొనుగోలు చేసినప్పటికీ ముంబై ఇండియన్స్ యాజమాన్యం సరిగా వాడుకోలేక పోయింది అన్న విమర్శలు కూడా వచ్చాయి అన్న విషయం తెలిసిందే.