మొదటి రాత్రి టెస్ట్ మ్యాచ్ లా జరిగింది.. అశ్విన్ భార్య షాకింగ్ కామెంట్స్?

praveen
ఇటీవల కాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని ఎంతో మంది సెలబ్రిటీలకు ప్రేక్షకులకు మధ్య దూరం తగ్గిపోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సెలబ్రిటీలు తమ అభిమానులతో ఇక సోషల్ మీడియా వేదికగా ఎప్పుడూ  ముచ్చటిస్తూ ఉండటం లాంటివి చేస్తూ ఉన్నారు. తద్వారా ఇక ఎన్నో పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉండడం గమనార్హం. ముఖ్యంగా క్రికెటర్లు క్రికెటర్లకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఇలా సోషల్ మీడియా లో ఏదైనా కామెంట్ చేశారు అంటే అది వైరల్ గా మారిపోతూ ఉంటాయి అని చెప్పాలి.


 ఇక ఇప్పుడు టీమిండియాలో స్టార్ స్పిన్నర్ గా కొనసాగుతున్న రవిచంద్రన్ అశ్విన్ భార్య సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు కాస్త సంచలనంగా మారిపోయాయి అని చెప్పాలి.. టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 255 అంతర్జాతీయ మ్యాచుల్లో 659 వికెట్లు పడగొట్టాడు. అంతేకాదు బ్యాటింగ్ లో ఐదు సెంచరీలు కూడా చేసి 3599 పరుగులు సాధించాడు. అనిల్ కుంబ్లే తర్వాత అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడు గా గుర్తింపు సంపాదించాడు. ఇటీవలే పుట్టినరోజు జరుపుకున్న నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఎంతోమంది అతనికి శుభాకాంక్షలు తెలిపారు.


 కాగా రవిచంద్రన్ అశ్విన్ భార్య ప్రీతి నారాయణన్  కూడా సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటుంది. ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. చమత్కారానికి వెటకారం జోడిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. అయితే ఎవరైనా సరే వ్యక్తిగత విషయాలను బహిర్గతం చేయడం తప్పే అన్న విషయం తెలిసిందే. అలాంటిది అశ్విన్ భార్య మొదటి రాత్రి విషయాలను అభిమానులతో పంచుకుంది. మొదటి రాత్రి గురించి అభిమానులతో పంచుకుంటూ ఫస్ట్ నైట్ ని ఒక టెస్ట్ మ్యాచ్ గా అభివర్ణించింది. ఆమె చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం అందరూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: