ఫాన్స్ కి అదిరిపోయే న్యూస్.. ఆ స్టార్ క్రికెటర్ మళ్లీ రాబోతున్నాడు?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా భారత ప్రేక్షకులందరికీ కూడా ఎంతగానో దగ్గరయ్యాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే క్రిస్గేల్ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు అన్నది తెలుస్తుంది. ఈనెల 16వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న ఐసీసీ క్రికెట్ లో రెండో సీజన్లో ఆడేందుకు విధ్వంసకర వీరుడు క్రిస్గేల్ మరోసారి భారత్లో అడుగుపెట్టబోతున్నాడు. వీరేంద్ర సెహ్వాగ్ సారథ్యంలోని గుజరాత్ జెయింట్స్ జట్టు యూనివర్సల్ బాస్ తో ఒప్పందం కుదుర్చుకుంది అన్నది తెలుస్తుంది. ఈ విషయాన్ని ఇక గుజరాత్ జట్టు యాజమాన్యం ఇటీవల అధికారికంగా ధ్రువీకరించింది అని చెప్పాలి.
అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో రికార్డులను క్రియేట్ చేసిన క్రిస్ గేల్ లెజెండ్స్ లీగ్ క్రికెట్ లో ఆడటం మాత్రం ఎంతో సంతోషంగా ఉంది అంటూ గుజరాత్ జట్టు యాజమాన్యం చెప్పుకొచ్చింది. అయితే క్రిస్ గేల్ తో ఒప్పందానికి ముందే గుజరాత్ జట్టు 15 మంది సభ్యుల బృందాన్ని ఎంపిక చేసుకుంది. ఇక ఫ్రాంచైజీ పర్సులో మరికొంత డబ్బు మిగిలి ఉండడంతో 2.48 కోట్లతో గేల్ తో ఒప్పందం కుదుర్చుకుంది. కాగా గుజరాత్ జెయింట్స్ జట్టు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి
గుజరాత్ జెయింట్స్ జట్టు: వీరేంద్ర సెహ్వాగ్ (కెప్టెన్), పార్థివ్ పటేల్, క్రిస్ గేల్, ఎల్టన్ చిగుంబురా, క్రిస్ ట్రెమ్లెట్, రిచర్డ్ లెవి, గ్రేమ్ స్వాన్, జోగిందర్ శర్మ, అశోక్ దిండా, డేనియల్ వెటోరి, కెవిన్ ఓబ్రెయిన్, స్టువర్ట్ బిన్నీ, మిచెల్ మెక్‌లాగెన్, లెండిల్ సిమన్స్, మన్విందర్ బిస్లా, అజంతా మెండిస్.