పాక్ తో మ్యాచ్ కి ముందు.. టీం ఇండియాకి ఎదురు దెబ్బ?
ఇక అతని స్థానంలో జట్టులోకి అక్షర్ పటేల్ వచ్చాడు. కాగా నేడు మరోసారి భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగబోతుంది. ఇక ఈ మ్యాచ్ కోసం ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే గత కొన్ని మ్యాచ్ ల నుంచి అంతంతమాత్రంగానే ప్రదర్శన చేస్తున్న అవేశ్ ఖాన్ అనారోగ్యం బారిన పడ్డాడు అని తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని బిసిసిఐ అధ్యక్షుడు ఇండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ స్వయంగా ప్రకటించడం గమనార్హం.
ప్రస్తుతం అవేశ్ ఖాన్ జ్వరంతో బాధ పడుతున్నాడని ప్రస్తుతం అతను డాక్టర్ల పర్యవేక్షణ లో ఉన్నాడు అంటూ చెప్పుకొచ్చాడు. అతను ప్రాక్టీస్ సెషన్ లో కూడా పాల్గొనలేదని రాహుల్ ద్రావిడ్ చెప్పడం గమనార్హం. ఈ క్రమం లోనే ఇక రాహుల్ ద్రావిడ్ చెప్పినదాన్ని బట్టి చూస్తే పాకిస్థాన్తో జరగబోయే కీలకమైన మ్యాచ్లో అతను జట్టు లో ఉండడం అనుమానం గానే కనిపిస్తోంది. ఒకవేళ అతను జట్టు లో లేక పోతే ఎవరిని తీసుకుంటారు అనే అంశంపై కూడా ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో చర్చ నడుస్తుంది. అవేశ్ ఖాన్ స్థానంలో అశ్విన్ జట్టు లోకి వచ్చే అవకాశం ఉంది అని తెలుస్తుంది.