టీమిండియాతో టి20 సిరీస్.. ఆస్ట్రేలియాకు బిగ్ షాక్?
ప్రస్తుతం ఆస్ట్రేలియా ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ చీలమండ గాయం తో బాధ పడుతున్నాడట. ఇటీవలే అతన్ని పరీక్షించిన వైద్యులు గాయం తీవ్రత ఇంకా ఎక్కువగానే ఉందని మరి కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటూ సూచించారట. ఈ క్రమంలోనే అతను లేకుండానే భారత్తో జరగబోయే టి20 సిరీస్ లో ఆస్ట్రేలియా జట్టు బరిలోకి దిగేందుకు సిద్ధం అవుతుంది అన్నది తెలుస్తుంది. కాగా ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ స్థానంలో వికెట్ కీపర్ జోష్ ఇంగ్లీస్ ను జట్టులోకి తీసుకుందట క్రికెట్ ఆస్ట్రేలియా.
కాగా జింబాబ్వే ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే మ్యాచ్ టౌన్స్ విల్లే వేదికగా జరగబోతోంది అన్న విషయం తెలిసిందే. ఇక నేడే రెండో వన్డే మ్యాచ్ జరగబోతున్న నేపథ్యంలో ఈ మ్యాచ్ చూసేందుకు ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే మొదటి వన్డే మ్యాచ్లోమార్ష్ గాయం బారినపడిన మిచెల్ మార్స్ పర్వాలేదనిపించాడు అన్న విషయం తెలిసిందే. 6 ఓవర్లు వేసిన ఈ ఆల్ రౌండర్ 22 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టారు. అయితే అటు బ్యాటింగ్లో మాత్రం నిరాశపరిచాడు అనే చెప్పాలి. కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు.