కార్తీక్ ను తీసుకొని.. పంత్ ను పక్కన పెట్టడానికి కారణం అదేనా?

praveen
గత కొంత కాలం నుంచి టీమిండియాలో ఎవరు ఊహకందని విధంగా ప్రయోగాలు చేస్తూ వస్తోంది జట్టు యాజమాన్యం. ఈ క్రమంలోనే మంచి ఫామ్ లో ఉన్న ఆటగాళ్లను కూడా పక్కన పెడుతూ వినూత్నంగా కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇస్తూ వస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇటీవలి కాలంలో టీమిండియా ఏదైనా మ్యాచ్ ఆడుతుంది అంటే చాలు కెప్టెన్ దగ్గర్నుంచి జట్టులోని ఆటగాళ్ల వరకు ఎవరు ఇండియాలో ఉంటారు అనేది ప్రేక్షకులను కన్ఫ్యూజ్ లో పడేస్తుంది అని చెప్పాలి. ఇక ఇటీవల పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో టీమ్ ఇండియా యాజమాన్యం మరోసారి ఇలాంటి నిర్ణయం తీసుకుంది.


 ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ లో కొనసాగుతూ ఒకవైపు బ్యాట్స్మెన్గా మరోవైపు వికెట్ కీపర్గా నిలకడగా రాణిస్తున్న రిషబ్ పంత్ ని పక్కనపెట్టి సీనియర్ ప్లేయర్ దినేష్ కార్తీక్ ను తుది జట్టులోకి తీసుకుంది టీమిండియా యాజమాన్యం. రిషబ్ పంత్ ని పక్కన పెట్టడం ఏంటి అని అందరూ ఆశ్చర్యపోయారు.  ఇక ఇలా జట్టులోకి దినేష్ కార్తీక్ ను తీసుకుంటున్నాము అంటూ టాస్ సమయంలో రోహిత్ శర్మ వెల్లడించాడు. కానీ దానికి కారణం మాత్రం చెప్పలేదు.



 అయితే టీమ్ ఇండియా యాజమాన్యం ఇలా రిషబ్ పంత్ ని పక్కనపెట్టి దినేష్ కార్తీక్ ను జట్టులోకి తీసుకోవడానికి వెనుక ఒక పెద్ద కారణమే ఉంది అన్నది తెలుస్తుంది. టి20 వరల్డ్ కప్ జట్టు కూర్పును సెట్ చేసుకునేందుకు ఇలా యాజమాన్యం నిర్ణయం తీసుకుందట. ఎందుకంటే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ నుంచి దినేష్ కార్తీక్ నిలకడగా రాణిస్తు ఫినీషర్ రోల్ పోషిస్తున్నాడు. ఇక పంత్ మాత్రం నిర్లక్ష్యమైన షాట్స్ ఆడుతూ  విమర్శలు ఎదుర్కొంటున్నాడు. దీంతో భారత ఫిషర్ ఎవరు అంటే దినేష్ కార్తిక్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఇక దీన్ని పరిశీలించేందుకు పంతు ను పక్కన పెట్టారని ప్రచారం జరుగుతుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: