రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా క్రికెటర్ రాహుల్.. వారికి థాంక్స్ చెబుతూ?

praveen
ఇటీవల కాలంలో భారత క్రికెట్లో యువ ఆటగాళ్లదే ఎక్కువగా హవా నడుస్తుంది అన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన తర్వాత తమ సత్తా ఏంటో నిరూపించుకుంటూ జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు ఎంతోమంది యువ ఆటగాళ్లు. ఈ క్రమంలోనే అదిరిపోయే ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు అని చెప్పాలి.  యువ ఆటగాళ్లు జట్టులోకి వస్తున్న నేపథ్యంలో ఒకప్పుడు జట్టులో చోటు సంపాదించుకుని.. ఆ తర్వాత ఫామ్ కోల్పోయి జట్టుకు దూరమైన ఆటగాళ్లకు చోటు దొరకడం చాలా కష్టం గానే మారిపోతుంది.


 కేవలం జట్టుకు దూరమైన ఆటగాళ్లు మాత్రమే కాదు జట్టులో కొనసాగుతోన్న సీనియర్ ఆటగాళ్లు కూడా తమని తాము ఎప్పటికప్పుడు కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది అని చెప్పాలి. ఏమాత్రం పేలవ ప్రదర్శన చేసినా కూడా తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ క్రమంలోనే యువ ఆటగాళ్ల నుంచి పోటీ పెరిగిపోయిన నేపథ్యంలో కొంతమంది సీనియర్ ఆటగాళ్లు జట్టులో చోటు సంపాదించుకోలేక ఏళ్ల తరబడి నిరీక్షణ ఎదురు చూస్తున్నారు. ఇక తమ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించిన వారు చాలా మంది ఉన్నారు అని చెప్పాలి.


 ఇక ఇదే లిస్ట్ లోకి చేరాడు ప్రస్తుతం టీమిండియా ఆటగాడు రాహుల్ శర్మ. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఇప్పటివరకు తన క్రీడా ప్రయాణంలో మద్దతుగా నిలిచిన అభిమానులకు భారత క్రికెట్ నియంత్రణ మండలికీ కృతజ్ఞతలు తెలిపాడు రాహుల్ శర్మ. కాగా ఈ ఆటగాడు టీమిండియా తరఫున 4 వన్డే మ్యాచ్ లు 2 టీ20లు మాత్రమే ఆడాడు. 2010లో డెక్కన్ చార్జెస్ జట్టు తరఫున అరంగేట్రం చేసిన రాహుల్ శర్మ తరువాత పూణే వారియర్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్ల తరఫున ఆడాడు. మొత్తంగా ఐపీఎల్ కెరియర్ లో 44 మ్యాచ్లు ఆడిన రాహుల్ శర్మ తన కెరీర్లో 40 వికెట్లు పడగొట్టాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: