కోహ్లీ ఫ్రెష్ గా మొదలు పెడతాడు : సంజయ్ బంగర్
కాగా నేటి నుంచి ఆసియా కప్ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం అందరి మెదళ్లను ఒకే ప్రశ్న తలెత్తుతుంది. అదే విరాట్ కోహ్లీ ఫాంలోకి వస్తాడా.. ఆసియా కప్లో రాణిస్తాడా అన్న ప్రశ్న. ఇంగ్లండ్ పర్యటన ముగిసిన వెంటనే వెస్టిండీస్, జింబాబ్వే పర్యటనకు దూరంగా ఉండి రెస్ట్ తీసుకున్నాడు విరాట్ కోహ్లీ. విరామం తర్వాత మళ్లీ టీమిండియాతో చేరాడు. విరామం అనంతరం ఆసియా కప్లో విరాట్ కోహ్లీ ఎంతో కొత్తగా కనిపిస్తాడు అని ప్రేక్షకులు బలంగా నమ్ముతున్నారు. ఇదే విషయంపై టీమిండియా మాజీ కోచ్ సంజయ్ బంగర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
33 స్టార్ క్రికెటర్ విశ్రాంతి ఏళ్ళ సమయంలో అసలు క్రికెట్ గురించి మాట్లాడలేదని వెల్లడించాడు. ఇంతకుముందు కూడా విశ్రాంతి తీసుకున్నప్పటికీ వాటికి పూర్తి బ్రేక్ అని చెప్పలేము అన్నాడు. మూడు వారాలపాటు కోహ్లీ క్రికెట్ కు దూరంగా వెళ్ళాడు. అందుకే ఆసియా కప్ లో ఫ్రెష్ గా మొదలు పెడతాడు.. క్రికెట్ గురించి మాట్లాడలేదు అంటే అతనికి ఎలా ఆడాలో స్పష్టంగా తెలిసినట్లే. అతను తనలా ఉన్నప్పుడు అద్భుతంగా ఆడతాడు అంటూ టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ చెప్పుకొచ్చాడు.