వైరల్ వీడియో : కలిసిపోయిన భారత్ పాకిస్థాన్ ఆటగాళ్లు?
టి20 ప్రపంచకప్ లో పాకిస్థాన్ చేతిలో ఓడిపోయింది భారత్. ఇప్పుడు ఆసియా కప్ లో ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమైంది అని చెప్పాలి. ఇప్పటికే ఈ గడ్డపై అడుగుపెట్టిన అన్ని జట్లు అక్కడ ప్రాక్టీస్ లో మునిగి తేలుతున్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే మ్యాచ్ ముందు భారత్ పాకిస్తాన్ ఆటగాళ్లు ఎలా మెలుగుతారు అనేది కూడా ఆసక్తికరంగా మారిపోయింది. కాగా ఎంతో క్రీడాస్ఫూర్తిని ప్రదర్శిస్తూ భారత్ పాకిస్తాన్ ఆటగాళ్ళ స్నేహితుల్లా కలిసిపోయారు అనేది తెలుస్తుంది.
ఈ క్రమంలోనే ఇక మైదానంలోకి ఎంట్రీ ఇచ్చిన భారత ఆటగాళ్లు అందరూ కూడా అప్పటికే మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్న పాకిస్తాన్ క్రికెటర్ లను కలిశారు. ఈ క్రమంలోనే గాయం కారణంగా జట్టు దూరమైన షాహీన్ అఫ్రిది ని కలిసి అతని గాయం ఎలా ఉంది అన్న విషయాలను తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన వీడియో ట్విటర్ వేదికగా వైరల్ గా మారిపోయింది. ఇక ఈ వీడియో చూసిన ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా ఫిదా అవుతున్నారు అని చెప్పాలి. క్రీడాస్ఫూర్తి అంటే ఇదే కదా అంటూ కామెంట్ చేస్తూ ఉన్నారు.