భారత్ - పాకిస్తాన్ మ్యాచ్.. అదనంగా 4 వేల టిక్కెట్లు?
అంతేకాదు భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే చాలు అది ఒక ఎమోషన్ గా ఫీల్ అవుతూ ఉంటారు ప్రేక్షకులు. అందుకే ఈ మ్యాచ్ ను హై ఓల్టేజీ మ్యాచ్ గా పిలుస్తూ ఉంటారు. కాగా మరికొన్ని రోజుల్లో ఆసియా కప్లో భాగంగా భారత్ పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగబోతోంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గత ఏడాది టి 20 ప్రపంచకప్లో భాగంగా పాకిస్థాన్ చేతిలో ఘోర ఓటమి చవిచూసిన భారత్ ఇక ఇప్పుడు ఆసియా కప్ లో ప్రతీకారం తీసుకోవాలని భావిస్తోంది. ఆ సమయంలో ఆసియా కప్ గెలవాలనే ఆత్మవిశ్వాసంతో ఉంది పాకిస్తాన్ చెట్టు. ఈ క్రమంలోనే ఆసియా కప్లో ఈనెల 28వ తేదీన జరగబోయే మ్యాచ్ఎంతో ఆసక్తికరంగా మారిపోయింది.
అయితే ఇక ఆసియా కప్ లో మ్యాచ్ గురించి చర్చ ముగిసేలోపే వరల్డ్ కప్ లో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగబోతోంది. అక్టోబర్ 23 వ తేదీన ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్ కి సంబంధించిన టికెట్లు విడుదల చేయగా కేవలం 5 నిమిషాల్లోనే అన్నీ అమ్ముడుపోయాయి. ఇలాంటి సమయంలో ఈ మ్యాచ్ కి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. మరో 4 వేల టికెట్లను అదనంగా విడుదల చేయాలని భావిస్తోంది. స్టేడియం కి ఎవరు ముందు వస్తే వారికి టికెట్లు అందించనున్నారట.