ఆసియా కప్ మొదటి విజేత.. ఎవరో తెలుసా?
అయితే మొదటి ఆసియా కప్ విజేత టీమిండియా అన్నది తెలుస్తుంది. 1984 నుండి ఆసియా కప్ నిర్వహించడం చేసారు. యూఏఈ వేదికగా నే ఆసియా కప్ జరిగింది. రౌండ్ రాబిన్ పద్ధతిలో వన్డే ఫార్మాట్లో ఇక ఈ టోర్నీని నిర్వహించారూ చెప్పాలి. ఇందులో భాగంగా భారత్ శ్రీలంక పాకిస్థాన్ జట్లు పోటీ పడ్డాయి. తర్వాత భారత్ శ్రీలంక జట్లు ఫైనల్ చేరగా చివరికి టీమిండియా విజేతగా నిలిచింది. అయితే ఈ టోర్నీలో ఆడిన రెండు మ్యాచ్లలో కూడా పాకిస్తాన్ ఇండియా,శ్రీలంక చేతిలో ఓడిపోవడం గమనార్హం. కాగా ముఖ్యంగా ఆసియా కప్లో భాగంగా 14సార్లు పాకిస్తాన్ భారత్ మధ్య ముఖాముఖి మ్యాచ్ జరిగింది.
ఇందులో ఎనిమిది సార్లు టీమిండియా గెలవగా పాకిస్తాన్ ఐదు మ్యాచ్లలో విజయం సాధించింది. ఒక మ్యాచ్ లో ఏమాత్రం ఫలితం తేలలేదు అని చెప్పాలి. అయితే 2016 నుంచి టీ20 ఫార్మాట్లలో ఆసియాకప్ నిర్వహించడం మొదలుపెట్టారు. ఒక దఫా వన్డే ఫార్మాట్లో మరోదఫా పొట్టి ఫార్మాట్లోనూ నిర్వహించారు. ఇకపోతే ఆసియా కప్ చరిత్రలో ఇప్పటివరకు అత్యధిక సార్లు టైటిల్ గెలిచిన ఏకైక జట్టుగా భారత్ కొనసాగుతోంది. ఇక భారత్ తర్వాత శ్రీలంక ఐదు సార్లు ఆసియా కప్ విజేత గా కొనసాగుతుంది అని చెప్పాలి. భారత చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్ కేవలం రెండుసార్లు మాత్రమే ఆసియా కప్ అందుకోవడం గమనార్హం.