ఆసియా కప్ 2022: ఈ సారి పాకిస్తాన్ కి అంత సీన్ లేదమ్మా !

VAMSI
ఆసియా కప్ లో భాగంగా రెండు గ్రూప్ లుగా విడిపోయి అయిదు జట్లు పోటీ పడనున్నాయి. అయితే పోటీ పడేది అయిదు జట్లు అయినా టైటిల్ కోసం ప్రధానమైన పోటీ మాత్రం చిరకాల ప్రత్యర్ధులు ఇండియా మరియు పాకిస్తాన్ ల మధ్యనే ఉంటుందన్నది క్రికెట్ ప్రముఖుల అభిప్రాయం. ఈ రెండు జట్లు గ్రూప్ లో ఉన్నాయి. షెడ్యూల్ ప్రకారం మొదటి మ్యాచ్ ఈ నెల 27 వ తేదీ శ్రీలంక మరియు ఆఫ్గనిస్తాన్ జట్ల మధ్యన జరగనుంది. ఈ మ్యాచ్ తర్వాత సెకండ్ మ్యాచ్ ఇండియా పాకిస్తాన్ ల మధ్యన జరగనుంది. అయితే ఎప్పటిలాగే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎంత హైప్ ఉంటుంది అనేది అందరికీ తెలిసిందే. అదే విధంగా ఇప్పుడు కూడా ఈ మ్యాచ్ కోసం ప్రపంచం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

ఇందుకు ప్రధాన కారణం... ఈ రెండు జట్లు కూడా ఐసీసీ ఈవెంట్ లలో తప్ప ఏ విధమైన ద్వైపాక్షిక సిరీస్ లు కానీ, లేదా త్రైపాక్షిక సిరీస్ లలో కానీ తలపడకపోవడమే. అంతే కాకుండా లాస్ట్ టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా పాకిస్తాన్ చేతిలో ఘోరంగా ఓడిపోవడం కూడా ఒక కారణం అని చెప్పాలి. అందుకే ఈ సారి ఎలాగైనా ఇండియా పాకిస్తాన్ ను ఓడించాలి అన్న పట్టుదలతో ఉంది. కానీ ఈ సారి పాకిస్తాన్ కు అంత సీన్ లేదని కొందరు క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే... పాకిస్తాన్ ప్రస్తుతం అంత బలంగా లేదని చెప్పాలి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణే... రీసెంటుగా ముగిసిన నెదర్లాండ్ సిరీస్ లో తమ స్థాయికి తగిన విధంగా ప్రదర్శన లేకపోవడమే.

ముఖ్యంగా ఈ సిరీస్ లో నెదర్లాండ్ ఆఖరి మ్యాచ్ లో దాదాపుగా పాకిస్తాన్ ను ఓడించినంత పని చేసింది. జట్టు మొత్తంలో చూస్తే ఒక్క బాబర్ ఆజామ్ తప్పించి మిగిలిన ఏ ఒక్క ఆటగాడు కూడా ఫామ్ లో లేకపోవడం చూస్తే ఈసారి పాకిస్తాన్ కు ఇండియా ను ఓడించలేదు అని అప్పుడే కంఫర్మ్ అయిపోతున్నారు. మరి ఏమి జరుగుతుంది అన్నది తెలియాలంటే వచ్చే ఆదివారం వరకు వెయిట్ చేయాల్సిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: