కూతుర్లు అడిగారని.. మళ్లీ ఆ పని చేయబోతున్న వార్నర్?

frame కూతుర్లు అడిగారని.. మళ్లీ ఆ పని చేయబోతున్న వార్నర్?

praveen
బీసీసీఐ ప్రతి ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహించినట్లు గానే అటు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రతి ఏడాది బిగ్ బాష్ లీగ్ నిర్వహిస్తూ ఉంటుంది అనే విషయం తెలిసిందే. ఈ టీ20 లీగ్ లో భాగంగా ఎంతో మంది విదేశీ ఆటగాళ్లు కూడా భాగం అవుతూ ఉంటారు. కానీ గత తొమ్మిదేళ్ల నుంచి అటు ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ అయిన డేవిడ్ వార్నర్ మాత్రం బిగ్ బాష్ లీగ్ గురించి పట్టించుకోవడం లేదు. ఇతర దేశాల టీ20 లీగ్ లో ఆడుతున్నాడు తప్ప సొంత దేశ క్రికెట్ బోర్డు నిర్వహిస్తున్న టి20 లీగ్ కి మాత్రం దూరంగానే ఉంటున్నాడు అన్న విషయం తెలిసిందే.


 కాని ఎన్నో ఏళ్ల నిరీక్షణకు చివరికి డేవిడ్ వార్నర్ తెరదించాడు అనేది తెలుస్తుంది. క్రికెట్ ఆస్ట్రేలియా నిర్వహించబోయే బిగ్ బాష్ లీగ్ లో భాగం కాబోతున్నాడు డేవిడ్ వార్నర్. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు అతనితో సంప్రదింపులు జరిపిన నేపథ్యంలో మళ్లీ బిగ్ బాష్ లీగ్ ఆడటానికి సిద్ధమయ్యాడు అన్నది తెలుస్తుంది. సిడ్నీ థండర్ జట్టుతో మళ్లీ రెండేళ్లు ఒప్పందం కుదుర్చుకున్నాడు.


 డేవిడ్ వార్నర్ సిడ్నీ థండర్ జట్టుకు డేవిడ్ వార్నర్ ప్రాతినిధ్యం వహించడం ఇది మూడో సారి కావడం గమనార్హం. 2011-12, 2013 -14 సమయంలో సిడ్నీ థండర్ జట్టుకు ఆడాడు.మధ్యలో ఒకసారి సిడ్నీ సిక్సర్స్ జట్టు తరపున ప్రాతినిధ్యం వహించాడు. అయితే ఇటీవలే మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను మళ్ళీ బిగ్బాస్ లీగ్ లోకి ఆడటానికి కారణం తన కుటుంబమేనని తన కూతుర్లు ఇద్దరు నన్ను బిగ్ బాష్ లీగ్ లో ఆడితే చూడాలని ఇష్టపడతారని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.. ఈక్రమంలోనే డేవిడ్ వార్నర్ బిగ్ బాష్ లీగ్ లో భాగంగా ఎలా రాణించి పోతున్నాడు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: