వైరల్ : శుభమన్ గిల్ బౌలింగ్ చేయడం ఎప్పుడైనా చూసారా?

praveen
ఇటీవల కాలంలో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేస్తున్న క్రికెటర్లు అందరికీ కూడా కేవలం ఒకే ఒక టాలెంట్ ఉంటే సరిపోవడం లేదు. నేను బ్యాట్స్మెన్ కేవలం బ్యాటింగ్ మాత్రమే చేయగలను అనుకొంటే వారికి జట్టులో స్థానం అంతంతమాత్రంగానే అనిపిస్తుంది. ఒకవైపు మెరుపు బ్యాటింగ్ చేస్తూనే మరోవైపు అవసరమైనప్పుడు బౌలర్గా కూడా అవతారం ఎత్తితే వారికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది జట్టు యాజమాన్యం. ఈ క్రమంలోనే బ్యాట్స్మెన్ల దగ్గర నుంచి బౌలర్ల వరకు కూడా అందరూ ఆల్రౌండ్ ప్రదర్శన చేయడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు అని చెప్పాలి.

 ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్లో స్టార్ ఆల్రౌండర్ లకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు అని చెప్పాలి. ఈ క్రమంలోనే మొన్నటి వరకు కేవలం బ్యాట్స్మన్గా లేదా బౌలర్గా మాత్రమే ఉన్న ఆటగాళ్ళు ఇప్పుడు తమలో ఉన్న కొత్త ప్రతిభను బయట పెట్టేందుకు సిద్దమవుతున్నారు. అయితే ఈ విషయాన్ని గమనించిన టీమిండియా యువ ఓపెనర్ శుభమన్ గిల్ కేవలం బ్యాటింగ్ పైనే కాదు బౌలింగ్ పై కూడా ఫోకస్ పెట్టాడు అనేది తెలుస్తుంది. ప్రపంచ కప్ లో ఎట్టిపరిస్థితుల్లో స్థానం సంపాదించడమే లక్ష్యంగా సన్నద్ధమవుతున్నాడు శుభమన్ గిల్. ప్రస్తుతం టీమిండియా లో ఎంత విపరీతమైన పోటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

 టీమ్ ఇండియా లో స్థానం కోసం ఒక్కో ప్లేస్ కి దాదాపు ముగ్గురు ఆటగాళ్లు పోటీపడుతున్నారు. ఈ క్రమంలోనే తమలో ఉన్న ఎక్స్ట్రా  టాలెంట్ ను మెరుగుపరుచుకుని ఇక జట్టులో స్థానం సుస్థిరం చేసుకునే విధంగా మార్గాలను అన్వేషిస్తున్నారు ఆటగాళ్ళు. ఇప్పటికే బ్యాట్స్మెన్గా సక్సెస్ అయిన శుభమన్ గిల్ ఇక ఇప్పుడు బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే వెస్టిండీస్ దిగ్గజం సునీల్ నరైన్ శైలిని అనుకరిస్తూ నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తు ఉండడం గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. శుభమన్ గిల్ బౌలింగ్ ప్రాక్టీస్ చేయడం చూసి అతనికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Gil

సంబంధిత వార్తలు: