పులులు ఎదురుగా ఉన్నా.. అందరూ రాహుల్ ద్రావిడ్ నే చూశారు?

praveen
న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ రాస్ టేలర్ ఇటీవలే తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఎన్నో విషయాలను బహిర్గతం చేస్తున్నారు. తన కెరియర్ లో జరిగిన ఆసక్తికర సంఘటనలు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు అనే విషయం తెలిసిందే. బయటికి తన కెరీర్ సాఫీగా సాగిపోయినట్లు కనిపించినప్పటికీ లోలోపల మాత్రం తాము ఎంతో వివక్ష ఎదుర్కొన్నానని చెప్పారు. ఐపీఎల్లో ఒకసారి డకౌట్ అయినప్పుడు రాజస్థాన్ ఓనర్ తన చెంప పగలగొట్టాడు అంటూ మరో నిజాన్ని బయటపెట్టాడు.

 ఇటీవలే టీమిండియా హెడ్ కోచ్ గా ఉన్న రాహుల్ ద్రవిడ్ గురించి మరో షాకింగ్ విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ రాస్ టేలర్. 2011లో రాహుల్ ద్రావిడ్ తో కలిసి రాజస్థాన్ రాయల్స్ కు ప్రాతినిధ్యం వహించాడు.  2011 ఐపీఎల్ సీజన్ సమయంలో టీమిండియా ఆటగాళ్లకు ఉన్న పాపులారిటీ ఏంటి అనేది కళ్ళారా చూశాను అంటూ చెప్పుకొచ్చాడు. రాహుల్ ద్రావిడ్ తో కలిసి రాజస్థాన్ లో ఉన్న రణథంబోర్ జాతీయ పార్కును సందర్శించాను.

 ఈ క్రమంలోనే మీరు ఎన్నిసార్లు పులులను చూశారు అంటూ రాహుల్ ద్రావిడ్ ని అడిగితే.. నేను ఒక్కసారి కూడా చూడలేదు అంటూ చెప్పుకొచ్చారు. ఇక కాస్త దూరం వెళ్ళిన తర్వాత పులి మాకు కనిపించింది. దీంతో ఈ రోజు నా వల్ల నువ్వు పులిని చూశావు అంటూ సరదాగా అతనితో మాట్లాడుతూ.. ఒక విషయాన్ని గమనించా.. మేం వెళ్తున్న వాహనాల వెనుక మరో సఫారీ వాహనంలో కొంతమంది వస్తున్నారు. అప్పటివరకు  పులులను కెమెరాలో బంధించిన వాళ్ళు అది ఆపేసి ఒక్కసారిగా కెమెరాలు అన్నింటిని రాహుల్ ద్రావిడ్ వైపు తిప్పారు. ఇది చూసి ఇండియాలో క్రికెటర్లకు ఇంత క్రేజ్ ఉందా అంటూ ఆశ్చర్యపోయాను. ఇలా ప్రపంచంలో సుమారు 4000 పులులు  ఉంటాయి. కానీ వాటికి మించిన ప్రత్యేకం రాహుల్ ద్రవిడ్ అంటూ చెప్పుకొచ్చాడు రాస్ టేలర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: