వాళ్లు వాగుతూనే ఉంటారు.. నేను పట్టించుకోను : గిల్

praveen
టీమిండియాలో మంచి బ్యాట్స్మెన్గా పేరు సంపాదించుకున్న శుభమన్ గిల్ ఇటీవలి కాలంలో మాత్రం స్లో స్ట్రైక్ రేట్ కారణంగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టీమిండియాలో అతనికి అవకాశాలు కూడా తగ్గిపోతున్నాయి. అయితే అతని బ్యాటింగ్ ప్రదర్శన దృశ్య శుభమన్ ను గిల్  టీమిండియా భవిష్యత్తు స్టార్ గా పరిగణిస్తున్నప్పటికి కూడా ఇక  శుభమన్ గిల్ స్లో స్ట్రైక్ రేట్ మాత్రం అందరినీ నిరాశపరుస్తుంది అని చెప్పాలి.  ఇటీవల వెస్టిండీస్తో జరిగిన మూడు వన్డేల సిరీస్లో భాగంగా అవకాశం దక్కించుకున్న శుభమన్ గిల్ 102.5 సగటుతో 205 పరుగులు చేశాడు..

 అయితే యాదృచ్చికంగా స్ట్రైక్ రేట్ కూడా 102.50 ఉండడం గమనార్హం. ఇక మూడో వన్డేలో 98 పరుగులతో వద్ద సెంచరీ మిస్ అయ్యాడు. కానీ కాస్త వేగంగా ఆడి ఉంటే సెంచరీ సాధించేవాడు అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే అతను మంచి ప్రదర్శన చేస్తున్నప్పటికీ కాస్త నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తున్నాడు అన్న విమర్శలు వస్తున్నాయి.. ఇలాంటి సమయంలోనే ఇటీవలే ఒక స్పోర్ట్స్ చానల్ తో మాట్లాడిన శుభమన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను తనపై వస్తున్న విమర్శలకు పెద్దగా స్పందించనని చెప్పుకొచ్చాడు. నేను ఎలా ఆడినా కూడా ఆటపై ప్రశ్నలు లేవనెత్తుతారు.

 అందుకే నా జట్టుకు నేను ఉపయోగపడేలా ఆడినంత కాలం ఎవరు ఎంత వాగుతూన్నా నేను పట్టించుకోను.  నా ఆట గురించి నాకు ఒక క్లారిటీ ఉంది అంటూ శుభమన్ గిల్ చెప్పుకొచ్చాడు. వెస్టిండీస్ పర్యటనలో తన ప్రదర్శన పట్ల సంతృప్తి చెందాను అంటూ తెలిపాడు. అయితే మొదటి మ్యాచ్లో నేను అవుట్ అయినందుకు కాస్త ఫీలయిన మాట వాస్తవమే. ఏదేమైనా కరేబియన్ గడ్డపై పరుగులు చేయడం కొత్త అనుభవాన్ని ఇచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు ఈ ఓపెనర్. కాగా మరికొన్ని రోజుల్లో శుభమన్ గిల్ జింబాబ్వే పర్యటనకు వెళ్లబోతున్న టీమిండియా జట్టులో అవకాశం దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే ప్రాక్టీస్ లో  నిమగ్నమయ్యాడు అని చెప్పాలి. 2023 వన్డే ప్రపంచకప్లో చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా తన ప్రదర్శనతో అదరగొడుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: