జట్టులో సెలెక్ట్ చేయలేదన్న కోపం.. ఇషాన్ కిషన్ ఏం చేశాడంటే?

praveen
మినీ ప్రపంచ కప్ గా పిలవబడే ఆసియా కప్ మరికొన్ని రోజుల్లో జరగబోతుంది. ఈ క్రమంలోనే అన్ని జట్లు కూడా ఆసియా కప్లో ఆడేందుకు సిద్ధమవుతున్నాయి. ఇలాంటి సమయంలోనే అటు భారత జట్టు కూడా ఇటీవలే ఆసియా కప్ ఆడబోయే 15 మంది సభ్యులతో కూడిన జట్టును అధికారికంగా ప్రకటించింది. అయితే ఇక భారత జట్టు యాజమాన్యం ప్రకటించిన జట్టులో కొంతమంది ఆటగాళ్లకు చోటు దక్కకపోవడం మాత్రం ఆశ్చర్యం కలిగించింది అని చెప్పాలి. ముఖ్యంగా గత ఇంత కాలం నుంచి మంచి ప్రదర్శన తో అదరగొడుతున్న ఇషాన్ కిషన్ కు ఆసియా కప్లో చోటు దక్కుతుందని అందరూ భావించారు.

 కానీ కె.ఎల్.రాహుల్ కోలుకొని మళ్లీ జట్టులోకి తిరిగి రావడంతో ఇక జట్టు సెలెక్షన్ లో ఇషాన్ కిషన్ ను పరిగణలోకి తీసుకోలేదు సెలెక్టర్లు. అయితే టాప్ ఆర్డర్లో ఇప్పటికే చోటు లేక పోవడం.. ఇక మిడిలార్డర్లో నమ్మదగిన బ్యాట్స్ మెన్లు  ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇషాన్ కిషన్ తో ప్రస్తుతం పనిలేకుండా పోయింది. అయితే కనీసం స్టాండ్బై ప్లేయర్ లిస్ట్ లో కూడా ఇషాన్ కిషన్ కు చోటు దక్కకపోవడం అభిమానులను ఆశ్చర్య పరిచింది అని చెప్పాలి. అయితే ఆసియా కప్ కోసం తనను ఎంపిక చేయలేదు అన్న కోపమో లేకపోతే ఇంకేదో తెలియదు గానీ ఇటీవలే ఇన్స్టాగ్రామ్లో భేళ్ల హంబెల్ కవితను పోస్టు చేశాడు.

 ఒక విషయం మీకు బాధను కలిగించినప్పటికీ.. మార్పు ఉండకూడదు. ఎవరైనా మిమ్మల్ని ఒక పుష్పం గా భావిస్తూ ఉంటే.. దాన్ని తిప్పికొడుతూ ఫైర్ గా మార్చండి అంటూ ఇషాన్ కిషన్  ఎవరికో ఏదో చెప్పాలనుకున్నది చెబుతున్నట్లుగా కనిపించింది. అయితే ఈ ఏడాది ఐపీఎల్ లో కూడా అద్భుతమైన ప్రదర్శన చేశాడు ఇషాన్ కిషన్. ఏకంగా అతన్ని 15.5 కోట్లు పెట్టి కొనుగోలు చేసంది ముంబై యాజమాన్యం. నమ్మకాన్ని నిలబెడుతూ 14 ఇన్నింగ్సులో 418 పరుగులు చేశాడు. ఒకవైపు ముంబై జట్టు విఫలమవుతున్న అతను మాత్రం బాగా రాణించాడు. ఇండియాలో కూడా వరుస అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: