నీరజ్ చోప్రా లేకపోవడంతో.. రెచ్చిపోయిన పాకిస్తాన్ అథ్లెట్?

praveen
ఒలంపిక్స్ లో ఎన్నో ఏళ్ల భారత నిరీక్షణకు తెర దించుతూ భారత్ గోల్డ్ మెడల్ అందించి అందరికీ సుపరిచితుడు గా మారిపోయిన జావలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా ఇటీవలే గాయం కారణంగా కామన్వెల్త్ క్రీడలకు దూరం అయ్యాడు అనే విషయం తెలిసిందే. అంతకుముందు ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలలో సిల్వర్ మెడల్ సాధించి సత్తా చాటిన నీరజ్ చోప్రా కామన్వెల్త్ క్రీడలలో గోల్డ్ మెడల్ సాధించడం ఖాయం అని అందరూ అనుకున్నారు. ఇలాంటి సమయంలో ఇక నీరజ్ చోప్రా అటు కామన్వెల్త్ క్రీడలకు దూరం అవడం మాత్రం ఎంతోమందిని నిరాశపరిచింది అని చెప్పాలి.

 ఇకపోతే ఇటీవల పురుషుల జావలిన్ త్రో విభాగంలో పాకిస్థాన్ క్రీడాకారుడు నదీమ్  అద్భుతం చేశాడు. నీరజ్ చోప్రా నుంచి ఎలాంటి పోటీ లేకపోవడంతో నదీమ్  90.18 మీటర్ల దూరం త్రో విసిరి స్వర్ణం సాధించాడు అనే చెప్పాలి. అంతేకాదు జావలిన్ త్రో 90 మీటర్లకు పైగా విసిరిన రెండవ ఆసియా అథ్లెట్గా గుర్తింపు సంపాదించుకున్నాడు.. 2017 లో చైనీస్ క్రీడాకారుడు  91.36 మీటర్ల దూరం జావలిన్ త్రో విసిరాడు. అయితే నదీమ్ ప్రదర్శనతో పాకిస్థాన్ 56 ఏళ్ల తర్వాత కామన్వెల్త్ గేమ్స్ లో ట్రాక్ అండ్ ఫీల్డ్ లో పతకం సాధించింది అని చెప్పాలి. అయితే వరల్డ్ నెంబర్వన్ నీరజ్ చోప్రా గాయం కారణంగా కామన్వెల్త్ క్రీడల నుంచి తప్పుకోవడం నదీమ్ కు ఎంతగానో కలిసి వచ్చింది అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే  కెరీర్లోనే అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన నదీమ్ పాకిస్తాన్  కలను సాకారం చేశాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే మొన్నటికి మొన్న జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలలో మాత్రం నాలుగవ స్థానంలో నిలిచాడు నదీమ్. అయితే ఈ పోటీలలో రెండవ స్థానంలో రజత పతకాన్ని గెలుచుకున్నాడు నీరజ్ చోప్రా .ఈ క్రమంలోనే కామన్వెల్త్ క్రీడల్లో బరిలోకి దిగితే ఎంతో అలవోకగా 90 మీటర్లు విసురుతాడు అని అందరూ భావించారు.. ఈ క్రమంలోనే  పాకిస్తాన్ గోల్డ్ మెడల్ సాధించిన విషయం తెలిసిన తరువాత నీరజ్ చోప్రా ఉండి ఉంటే బాగుండేది. భారత్ కి గోల్డ్ మెడల్ వచ్చేది అని భావిస్తూ ఉన్నారు ఎంతోమంది అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: