పంత్, సూర్య, ఇషాన్ కాదు.. ఓపెనర్ గా అతనే బెస్ట్?

praveen
అక్టోబర్లో ఆస్ట్రేలియా వేదికగా టి20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది అనే విషయం తెలిసిందే. ఇక ప్రపంచ దేశాల జట్ల కన్ను మొత్తం ఈ మెగా టోర్నీకి పైనే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ సారి విశ్వ విజేతగా నిలవాలనే పట్టుదలతో అన్ని జట్లు కూడా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాయ్. అక్టోబర్ 16 నుంచి టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది అనే విషయం తెలిసిందే. అయితే ఇటీవలి కాలంలో టి20 వరల్డ్ కప్ కోసం ఎన్నో ప్రయోగాలు చేస్తోంది టీమిండియా. అంతే కాదు ఎంతో మంది యువ ఆటగాళ్లు కూడా టీ-20 ఫార్మెట్లో బాగా రాణిస్తున్నారు. దీంతో టి20 వరల్డ్ కప్ కోసం భారత జట్టు ఎంపిక సెలెక్టర్లకు పెద్ద తలనొప్పిగా మారిపోయింది అన్నది మాత్రం తెలుస్తుంది. ముఖ్యంగా ఓపెనింగ్ జోడి పై పెద్ద చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే.

 సాధారణంగా టీమిండియా తరఫున టి-20లో కెప్టెన్ రోహిత్ శర్మ కు జోడీగా రాహుల్ బరిలోకి దిగుతూ ఉండేవాడు. కానీ ఇటీవల అతను జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలో ఓపెనింగ్ స్థానంలో ఎన్నో ప్రయోగాలు చేసింది టీమిండియా. ఇషాన్ కిషన్, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్ ఇలా పలువురు మిడిలార్డర్ బ్యాట్స్మెన్ లను ఓపెనర్ గా మన బరిలోకి దింపి టెస్ట్ చేసింది. ఇదే విషయంపై స్పందించిన టీమిండియా మాజీ క్రికెటర్ దీప్ దాస్ గుప్తా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ కు జోడీగా రాహుల్ సరిపోతాడని ఒకవేళ అతను లేకపోతే పృథ్వీ షా అయితే బాగుంటుంది అని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ప్రతిభ అద్భుత నైపుణ్యాలు అతని సొంతం అంటూ చెప్పుకొచ్చాడు. కాబట్టి అతని ప్రపంచకప్ జట్టుకు ఎంపిక చేయాలంటూ సెలెక్టర్లకు ఒక సూచన చేశాడు దీప్ దాస్ గుప్తా.

 ఇటీవలే ఒక క్రీడా ఛానల్తో మాట్లాడుతూ టి20 వరల్డ్ కప్ లో ఓపెనింగ్ జోడిగా రోహిత్ శర్మ కె.ఎల్.రాహుల్ కి నా మొదటి ప్రాధాన్యం. ఒకవేళ వీరిద్దరిలో ఎవరైనా దూరమైతే మూడో ఓపెనర్గా పృథ్వీ షా అయితే బెటర్. గత ఏడాది కాలం నుంచి అతనికి ఏ సిరీస్ లో కూడా సెలెక్టర్లు అవకాశం ఇవ్వలేదు. ఇటీవలే రంజీ ట్రోఫీలో అద్భుతంగా రాణించిన పృథ్వీ షా    జట్టును ఫైనల్కు చేర్చాడు అంటూ దీప్ దాస్గుప్తా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: