వరల్డ్ కప్ లో చోటు దక్కించుకోబోయే.. ముగ్గురు ఫేసర్లూ వీరే?

praveen
మరో మూడు నెలల్లో ఆస్ట్రేలియా వేదికగా టి20 వరల్డ్ కప్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే  ఇక మరికొన్ని రోజుల్లో యూఏఈ  వేదికగా ఆసియాకప్ కూడా జరగబోతుంది. ఈ క్రమంలోనే ఇక ఈ రెండు కప్పులని ఎగరేసుకుపోవటానికి సంసిద్ధమవుతోంది టీం ఇండియా. గత కొన్ని రోజుల  నుంచి ఇండియా జట్టులో ఎన్ని ప్రయోగాలు జరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఆసియా కప్ తర్వాత  టి20 వరల్డ్ కప్ ఆడబోయే 15 మంది సభ్యులతో కూడిన జట్టును టీమిండియా ప్రకటించే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఇక టీమిండియా తరఫున టీ20 ప్రపంచకప్లో ఆడబోయే ఆటగాళ్లు ఎవరైతే బాగుంటుంది అన్న విషయంపై ఇప్పటికి ఎంతో మంది మాజీ ఆటగాళ్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు.

 ఇలాంటి సమయంలో టీమ్ ఇండియా జట్టు వరుసగా ప్రయోగాలు చేస్తూ ఉండడం మాత్రం అందరినీ కన్ఫ్యూజన్లో పడేస్తోంది. ఇకపోతే ఇటీవల ఇదే విషయంపై స్పందించిన భారత మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ అక్టోబర్లో ఆస్ట్రేలియాలో జరగబోయే ప్రపంచకప్ లో భారత జట్టులో చోటు దక్కించుకోబోయే ముగ్గురు పెసర్ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచ కప్ నుంచి  11  మంది ఫేసర్లను టీమిండియా ఆడించింది అన్న విషయాన్ని తెలిపారు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్లో మంచి ప్రదర్శన చేయడం కారణంగా కొంతమంది భారత జట్టులో భాగమయ్యారు అంటూ చెప్పుకొచ్చాడు.

 ఈ క్రమంలోనే టి-20 ప్రపంచ కప్ లో భారత ఫేస్ లైనప్ గురించి మాట్లాడుతూ జస్ప్రిత్ బూమ్రా, మహ్మద్ షమి, భువనేశ్వర్ కుమార్ లను ఎంపిక చేశాడు. భువనేశ్వర్ కుమార్ పాత కొత్త బంతులతో రాణించగలడు. మహమ్మద్ షమి ప్రత్యర్థిపై ఎంతో అద్భుతంగా ఎటాకింగ్ చేస్తాడు. జస్ప్రిత్ బూమ్రా మిడిల్ డెత్ ఓవర్లలో పరుగుల ప్రవాహాన్ని అడ్డుకుంటాడు. మరోవైపు ఇక హార్దిక్ పాండ్యా రూపంలో భారత జట్టుకు ఫాస్ట్ బౌలర్ కం ఆల్ రౌండర్ ఉన్నాడని చెప్పుకొచ్చాడు  ఇక భారత్ కు ఉన్న మెరుగైన ఫేసర్లలో బుమ్రా, షమి, భువనేశ్వర్ కుమార్ లో టాప్ త్రీ లో ఉన్నారు అని నేను అనుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చాడు  మాజీ బౌలింగ్ కోచ్ శ్రీధర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: