చింపాంజీ తెలివికి.. నెటిజన్లు ఫిదా.. వైరల్ వీడియో?

praveen
మానవులు ఆదిమానవులు కోతుల జాతుల నుంచి వచ్చారు అన్నది ఎన్నో పరిశోధనల్లో బయటపడింది. ఎంతో మంది సైంటిస్టులు ఈ విషయాన్ని చెబుతారు. అయితే ప్రస్తుత సమయంలో కోతుల కంటే మనుషులు ఎంతో తెలివైన వారిగా కొనసాగుతున్నారు. ఇక నేటి రోజుల్లో కూడా మనుషులు కోతుల నుంచి పుట్టారు అన్న దానికి నిదర్శనంగా ఎన్నో ఉదాహరణలు చెప్పవచ్చు అని చెప్పాలి. ముఖ్యంగా కోతుల జాతి లో ఒక రకమైన చింపాంజీలు అచ్చం మనుషుల లాగానే ప్రవర్తించడం లాంటివి చేస్తూ ఉంటాయి. ఇక మనుషుల లాగానే చేష్టలు చేయడమే కాదు ఎమోషన్స్ కూడా మనిషి లాగానే చూపిస్తూ ఉంటాయి చింపాంజీలు.

 అయితే చింపాంజీల డిఎన్ఏ  మనుషుల్లోని డీఎన్ఏ దాదాపు 18 శాతం ఒకే విధంగా ఉంటుందని అందుకే చింపాంజీలు అచ్చం మనుషులు లాగానే ప్రవర్తిస్తాయి అని ఇప్పటికే నిర్వహించిన ఒక అధ్యయనంలో కూడా వెల్లడైంది. ఈ క్రమంలోనే ఇటీవల చింపాంజీ కి సంబంధించిన ఒక వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది అని చెప్పాలి. ఈ వీడియో చూసిన తర్వాత చింపాంజీలు మనుషులకు దగ్గర బంధువులు అని ఎందుకు అభివర్ణిస్తారో అన్న విషయం ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 సాధారణంగా స్కూల్లో చదువు కోవడానికి వెళ్లిన పిల్లలు టీచర్ చెప్పిన టాస్క్ లూ ఎంతో వేగంగా పూర్తి చేస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే చింపాంజీ కూడా ఇలాగే ఒక టాస్క్ ను ఎంతో చక్కగా వేగంగా పూర్తి చేసింది. కంప్యూటర్ స్క్రీన్ పై నెంబర్ గేమ్ ఆడింది చింపాంజీ.  ఒకటి నుంచి తొమ్మిది అంకెలు ఆ కంప్యూటర్ స్క్రీన్ పై కనిపించాయి. ఈ క్రమంలోనే చింపాంజీ ఎంతో వేగంగా వాటిని వరుసక్రమంలో టచ్ చేస్తూ ఆటను ముగిస్తుంది. ఇక ఈ చింపాంజీ తెలివికి ప్రతి ఒక్కరూ కూడా అవాక్కవుతున్నారు అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: