వరల్డ్ కప్ లో.. అతను అంత బ్యాడ్ ఛాయిస్ కాదు : పార్థివ్ పటేల్

praveen
గత కొంత కాలం నుంచి టీమిండియా ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే జట్టులో ఎవరు ఎప్పుడు అవకాశం దక్కించుకుంటారు అనేది ఊహకందని విధంగానే ఉంది. అంతే కాకుండా వరుసగా కెప్టెన్లను మారుస్తూ ప్రేక్షకులందరినీ అవాక్కయ్యేలా చేస్తుంది బీసీసీఐ. ఈ క్రమంలోనే  ఆటగాళ్ల ప్రదర్శనను ఎప్పటికప్పుడు పరిగణలోకి తీసుకుంటూ టి20 ప్రపంచకప్ లో అత్యుత్తమ  జట్టును బరిలోకి దింపడమే లక్ష్యంగా  బీసిసిఐ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రపంచ కప్ లో సెలెక్ట్ చేసే ఆటగాళ్ల విషయం పై పలువురు మాజీ ఆటగాళ్లు స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు.

 ఈ క్రమంలోనే ప్రస్తుతం టీమిండియా సీనియర్ బౌలర్ గా కొనసాగుతున్న మహమ్మద్ షమి కి వరల్డ్కప్ జట్టులో చోటు దక్కుతుందా  లేదా అనే విషయంపై కూడా చర్చ జరుగుతోంది. అయితే ఐపీఎల్లో బాగా రాణించిన ఎంతో మంది ఆటగాళ్లకు టీమిండియా లో అవకాశం కల్పించింది బీసీసీఐ. కానీ సీనియర్ బౌలర్ షమీకి మాత్రం టి20 లలో అవకాశం దక్కించుకోలేక పోయాడు. ఈ ఏడాది గుజరాత్  కు ప్రాతినిధ్యం వహించాడు. 20 వికెట్లు పడగొట్టిన కూడా అతనికి టి-20లో ఆడే అవకాశం మాత్రం రాలేదు. ఇదే విషయంపై స్పందించిన మాజీ ఆటగాడు పార్థివ్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన ప్రదర్శనతో దినేష్ కార్తీక్ టీమిండియా తరఫున పునరాగమనం చేశాడు. నిజానికి షమి కూడా ఐపీఎల్లో అదరగొట్టాడు.

 గత ప్రపంచ కప్ కంటే ఇపుడు మరింత మెరుగు అయ్యాడు. కాబట్టి ఈసారి అతడు ప్రపంచకప్లో మరి అంత బ్యాడ్ ఛాయిస్ ఏమీ కాదు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. కానీ మేనేజ్మెంట్ అతన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదో అర్థం కావట్లేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే ఎన్నో ఏళ్ల నుంచి జట్టుకు దూరమైన 37 ఏళ్ల బ్యాట్స్మెన్ దినేష్ కార్తీక్ మాత్రం ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత మళ్ళీ టీమిండియా లోకి పునరాగమనం చేసిన ఫినిషర్ పాత్రను పోషిస్తూ అదరగొడుతున్నాడు. మరి మహమ్మద్ షమికి రానున్న రోజుల్లో అవకాశం దొరుకుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: