కామన్వెల్త్ క్రీడల్లో.. మోస్ట్ సక్సెస్ఫుల్ అథ్లెట్.. ఎన్ని గోల్డ్ మెడల్స్ అంటే?

praveen
సాధారణంగా ఎంతో మంది క్రీడాకారులు  ఒలంపిక్స్, కామన్వెల్త్ క్రీడలు,  ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు లాంటి  విశ్వ వేదికలపై తమ దేశం తరఫున ప్రాతినిధ్యం వహించి బంగారు పతకాన్ని సాధించి పెట్టడమే లక్ష్యంగా బరిలోకి దిగుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే కొంత మంది క్రీడాకారులకు బంగారు పతకాన్ని చేజారీ నప్పటికీ సిల్వర్,బ్రాంజ్ మెడల్ సాధించి చివరికి సరిపెట్టుకోవడం చూస్తూ ఉంటారు.

 అయితే మరికొంతమంది క్రీడాకారుడు మాత్రం విశ్వ వేదికలపై అద్భుతంగా రాణిస్తూ వరుసగా బంగారు పతకాలు సాధించి తమకు తిరుగులేదని నిరూపిస్తూ ఉంటారు. ఇలా ఇప్పటి వరకూ ఎంతోమంది ఇలా బంగారు పతకాలతో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసారు అని చెప్పాలి.  కాగా ప్రస్తుతం బర్మింగ్హామ్ వేదికగా కామన్వెల్త్ క్రీడలు జరుగుతున్నాయ్. ఈ క్రీడల్లో భాగంగా అన్ని దేశాలకు చెందిన అథ్లెట్స్ పాల్గొంటున్నారు. బంగారు పతకం సాధించడమే లక్ష్యంగా అందరూ బరిలోకి దిగుతున్నారు. కొంతమందికి నిరాశే ఎదురవుతుంది. ఈ నేపథ్యంలోనే కామన్వెల్త్ క్రీడల చరిత్రలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ అథ్లెట్ ఎవరు అనేది హాట్ టాపిక్ గా మారింది.

 ఆస్ట్రేలియా స్విమ్మర్ ఎమ్మా మెక్ కియాన్ ఇక కామన్వెల్త్ క్రీడల్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ అథ్లెట్ గా అవతరించింది అని చెప్పాలి.. ఎందుకంటే క్రీడాకారులకు అందని ద్రాక్షలా ఉన్న బంగారు పతకాన్ని ఇక ఈమె అందరి కంటే ఎక్కువసార్లు సాధించింది అని చెప్పాలి. 2014 నుంచి ఇప్పటివరకూ ఏకంగా 11 సార్లు కామన్ వెల్త్ క్రీడల్లో భాగంగా బంగారు పతకాన్ని సాధించి అదరగొట్టింది. గత రెండు కామన్వెల్త్ క్రీడలు ఎనిమిది స్వర్ణాలు సాధించిన మెక్ కియాన్ ఇటీవల జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా మూడు గోల్డ్మెడల్స్ సాధించింది. అయితే గతంలో ఆస్ట్రేలియా స్విమ్మర్ ల పేరిట ఉన్న 10 బంగారు పథకాల రికార్డును బద్దలు కొట్టింది మెక్ కియాన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: