ఇంస్టాలో కోహ్లీ పెట్టే ఒక్కో పోస్ట్ కి.. ఇన్ని కోట్లా?

praveen
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి సోషల్ మీడియా లో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాలో ఎంతో మంది క్రికెటర్లు ఉన్న ఎందుకో విరాట్ కోహ్లీకి మాత్రం ఎప్పుడూ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి కూడా తన బ్యాటింగ్ సామర్థ్యంతో అత్యుత్తమ ఆటగాడు గా పేరు సంపాదించుకున్నాడు విరాట్ కోహ్లీ. అంతేకాదు ఇక టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు కూడా చేపట్టి ఎంతో సమర్థవంతంగా జట్టును ముందుకు నడిపించాడు. ఇక మైదానంలో ఎప్పుడూ అగ్రెసివ్ గా ఉంటూ ఎంతో మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు.


 ఇలా క్రమక్రమంగా విరాట్ కోహ్లీ ఆటతీరు అతనికి ఊహించని రేంజ్ లో పాపులారిటీ తెచ్చిపెట్టింది అని చెప్పాలి. ప్రస్తుతం టీమిండియా లో మోస్ట్ పాపులర్ క్రికెటర్ గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ అటు టీమిండియా ద్వారా భారీగా సంపాదించడమే కాదు ఎన్నో బ్రాండ్స్ కి ప్రమోషన్స్ నిర్వహిస్తూ కోట్ల రూపాయలను వెనకేసుకుంటున్నాడు. అదే సమయంలో ఇక సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ద్వారా కూడా విరాట్ కోహ్లీ కోట్ల రూపాయలను బ్యాంకు ఖాతాలో చేర్చుకుంటు ఉన్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ పెట్టె ఒక్కో పోస్ట్ విలువ ఎంత అన్న విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. కాగా హవర్ హెచ్క్యూ ఇంస్టాగ్రామ్ రిచ్ లిస్ట్ 2022 ప్రకారం టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇంస్టాగ్రామ్ లో ఒక్కో స్పాన్సర్ పోస్ట్ కి 8.69 కోట్లు ఛార్జ్ చేస్తున్నాడట. ఒక్కో పోస్ట్ కి ఎక్కువ డబ్బులు తీసుకునే ఆటగాళ్ల లిస్టు లో 14వ ప్లేస్లో కొనసాగుతున్నాడు విరాట్ కోహ్లీ. టాప్ 25 లో ఆసియా నుంచి ఒకే ఒక్కడు గా నిలిచాడు. ఈ లిస్టులో క్రిస్టియయానో రోనాల్డో మొదటి స్థానంలో ఉండగా.. ఒక్కో పోస్టుకు 17 కోట్లు సంపాదిస్తూ ఉంటాడట. ఈ విషయం తెలిసి అందరూ షాక్ లో మునిగి పోతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: