బీసీసీఐ షాకింగ్ నిర్ణయం.. ఆటగాళ్ల లాగే అంపైర్లకు ప్రమోషన్?

praveen
ప్రస్తుతం క్రికెట్ ప్రపంచాన్ని మొత్తం శాసిస్తూ.. తాను చెప్పిందే వేదంగా నడిపిస్తున్న క్రికెట్ బోర్డు ఏది అంటే అది భారత క్రికెట్ బోర్డు అన్న విషయం తెలిసిందే. ప్రస్తుత భారత క్రికెట్ బోర్డు ఏది చెబితే ఐసీసీ అదే చేస్తూ ముందుకు సాగుతూ ఉంది. ఇలా క్రమక్రమంగా పూర్తిగా ప్రపంచ క్రికెట్ను శాసిస్తున్న స్థాయికి ఎదిగింది భారత క్రికెట్ అనే చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల అంపైర్ల విషయంలో కూడా బిసిసిఐ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. కొత్త పంథాను అనుసరించేందుకు సిద్ధమయింది బిసిసిఐ. ఇది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అనిచెప్పాలి. సాధారణంగా అద్భుతమైన ప్రదర్శన చేస్తూ టీమిండియాలో కీలక ఆటగాళ్లుగా ఎదిగిన వారికి గ్రేడ్ రూపంలో ప్రమోషన్స్ ఇస్తూ ఉంటుంది బీసీసీఐ.

 ఈ క్రమంలోనే ఏ గ్రేడ్, ఏ ప్లస్, బి గ్రేడ్ ఆటగాళ్లకు కేటాయిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇదే నిబంధన అటు ఆటగాళ్లకు మాత్రమే కాదు అంపైర్ల కు కూడా వర్తించే విధంగా ప్రస్తుతం భారత క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది అనేది తెలుస్తుంది. ఐసిసి ఎలైట్ సాంబార్ నెంబర్ నెంబర్ అయిన నితిన్ మీనన్ సహా మరో నలుగురు అంతర్జాతీయ అంపైర్ల కు ఏ ప్లేస్ కేటగిరీలో చోటు కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇందులో అనిల్ చౌదరి, మదన్ గోపాల్ జయరామన్, వీరేంద్ర కుమార్ శర్మ, కేఎం అనంత పద్మనాభం ఉండటం గమనార్హం.

 ఇటీవల జరిగిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో భాగంగా బిసిసిఐ ఈ నిర్ణయం తీసుకుంది అన్నది తెలుస్తుంది. అయితే మాజీ అంతర్జాతీయ అంపైర్లు అయినా హరిహరన్ సుధీర్ అనాని, అమిష్ సాహెబ్ బీసీసీఐ అంపైర్ సబ్కమిటీ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ సందర్భంగా ఇచ్చిన రిపోర్టు మేరకు ఇక బీసీసీఐ కొత్తగా ఏ ప్లస్ కేటగిరి సృష్టించింది అన్నది తెలుస్తుంది. ఇప్పటివరకు అంపైర్ల గ్రేట్ కాంట్రాక్టు విషయంలో ఏ బి సి డి కేటగిరీలు మాత్రమే ఉండటం గమనార్హం. ఇక కొత్తగా ఏ ప్లస్  కేటగిరి చేర్చడం చేసారు. ఈ  క్రమంలోనే ఏ, ఏ ప్లస్ అంపైర్ లకు ఒక ఫస్ట్క్లాస్ మ్యాచ్ కు 40 వేలు.. బీ, సీ కేటగిరి లో ఉన్న అంపైర్ లకు 30000 ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: