కామ్ గా ఉండే కోచ్ రాహుల్ ద్రావిడ్.. ఏం చేశాడో చూడండి?
శిఖర్ ధావన్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గానే ఉంటాడు. ఎంతో చలాకీగా ఉంటూ ఆసక్తికర వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం లాంటివి చేస్తూ ఉంటాడు. ఇప్పుడు వరకు ఇలా ఎన్నో వీడియోలతో అభిమానులను ఆకర్షించాడు. ఇక ఇటీవలే వెస్టిండీస్ గడ్డపై అడుగుపెట్టిన నేపథ్యంలో ఒక ఆసక్తికర వీడియో తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు శిఖర్ ధావన్. ఒకసారి ఈ వీడియోలో చూసుకుంటే ఇక అందరూ హాయ్ చెబుతున్నట్లుగా సౌండ్ వస్తుంది. ఈ క్రమంలోనే ముందుగా శిఖర్ ధావన్ అందరికీ హాయ్ చెబుతాడు.
ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్, తర్వాత ఇషాన్ కిషన్, చాహల్, జడేజా, సిరాజ్ తమదైన శైలిలో హాయ్ అంటూ లోపలి నుంచి ఎంట్రీ ఇస్తారు. ఇక ఎప్పుడూ కామ్ గా కనిపించే హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ సైతం యువ ఆటగాళ్లకు అనుకరిస్తూ చిరునవ్వులు చిందిస్తూ హాయ్ చెబుతూ వెళ్ళిపోతాడు. అయితే అందరు ఆటగాళ్లు హాయ్ చెప్పడం ఒక ఎత్తయితే కోచ్ రాహుల్ ద్రవిడ్ చివర్లో వచ్చి హాయ్ చెప్పడం మరో ఎత్తు అని చెప్పాలి. ఈ వీడియో పై ఎంత మంది నెటిజన్లు స్పందిస్తున్నారు. ద్రావిడ్ సార్ ఎప్పుడు మిమ్మల్ని ఇలా చూడలేదు... మిమ్మల్ని కూడా శిఖర్ ధావన్ యోయో భాయ్ గా మార్చేశాడు కదా అంటూ కామెంట్ చేస్తున్నారు అభిమానులు.