ఆ బౌలర్ వేసిన బంతితో.. బాబర్ అజాంకి దిమ్మ తిరిగిందిగా?
ఇక ఈ వికెట్ ఎందుకు అంతలా హాట్ టాపిక్ గా మారిపోయింది అంటే ఎంతో దూకుడుగా ఆడుతున్న బాబర్ సైతం తాను అవుట్ అయిన విషయాన్ని నమ్మలేక పోయాడు. అతనికి సందేహం కలిగేలా చేసింది జయసూర్య సంధించిన బంతి. లంకతో తొలి దశలో భాగంగా 342 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించింది పాకిస్తాన్. షాపిక్ అబ్దుల్లా బాబర్ ఇన్నింగ్స్ నిలబెట్టే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికే షఫీక్ సెంచరీ చేయగా బాబర్ అర్ద సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇద్దరి భాగస్వామ్యం బలపడుతున్న సమయంలో బౌలింగ్ చేయడానికి వచ్చాడు ప్రభాత్ జయసూర్య.
అయితే తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లుతో చెలరేగిన ప్రభాత్ జయసూర్య విషయంలో అటు పాకిస్థాన్ బ్యాట్స్మెన్లు కూడా అప్రమత్తమయ్యారు. అయితే రెండో ఇన్నింగ్స్ లో కూడా మరోసారి మెరిశాడు ఈ బౌలర్. సెంచరీలతో కొరకరాని కొయ్యగా మారిన బాబర్ క్రీజులో ఉన్న సమయంలో ప్రభాస్ జయసూర్య ఓవర్ ద వికెట్ మీదుగా పోలింగ్ చేశాడు. ఈ క్రమంలోనే లెగ్ స్టంప్ అవతల పడిన బంతిని బాబర్ సరిగ్గా అంచనా వేయలేకపోయాడూ. దీంతో ఆఫ్ స్టాప్ మీదుగా పడిన బంతికి ప్యాడ్ అడ్డు పెట్టాడు. కాని అక్కడే ట్విస్ట్ ఎదురైంది. ఆప్స్ స్టంప్ అవతల పడిన బంతి బాబర్ కాళ్ళ వెనకాల నుంచి వెళ్లి నేరుగా వికెట్లను తాకింది. దీంతో బాబర్ కి ఏం జరిగిందో అసలు అర్థం కాలేదు. చివరికి నిరాశతో బాబర్ వెనుదిరిగాడు.