
తొలి వన్డేకు వర్షం గండం ఉందా.. రిపోర్ట్ ఇదే?
అయితే ప్రస్తుతం ఇంగ్లాండ్ లో వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది అన్న విషయం తెలిసిందే. రీ షెడ్యూల్ టెస్ట్ మ్యాచ్ కి వరుసగా మూడు రోజులపాటు వర్షం అంతరాయం కలిగించింది. తర్వాత మాత్రం టీ20 సిరీస్ లో ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది అన్న విషయం తెలిసిందే. తొలి వన్డే మ్యాచ్ కి కూడా ప్రస్తుతం ఎలాంటి వర్షసూచన లేదు అని లండన్ వాతావరణ శాఖ పేర్కొంది. లండన్ లోని ది ఓవల్ మైదానం వేదిక తొలి వన్డే మ్యాచ్ జరగబోతోంది. ఈ క్రమంలోని అక్కడ ఉష్ణోగ్రతలు సాధారణంగానే నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఈ క్రమంలోనే రోజు మొత్తంలో కూడా ఏ సమయంలో వర్షం పడేందుకు ఆస్కారం లేదని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఓవల్ వేదికగా మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో ఈ స్టేడియంలో పిచ్ సాధారణంగా నిర్జీవంగా నే ఉంటుంది. బ్యాట్స్మెన్ లకు ఎక్కువగా అనుకూలిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే బ్యాట్స్మెన్ చెలరేగి పోయే అవకాశం ఉంది. ఫాస్ట్ బౌలర్ల కంటే స్పిన్నర్లు ఈ పిచ్ పై కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది.
కాగా ఇక మొదటి మ్యాచ్ ఆడబోయే జట్లు అంచనా ప్రకారం..
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ/శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, ప్రసిధ్‌కృష్ణ, యుజ్వేంద్ర చహల్.
ఇంగ్లండ్: బట్లర్ (కెప్టెన్), జేసన్ రాయ్, సాల్ట్, బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్, మొయిన్ అలీ, లివింగ్‌స్టోన్, విల్లే, కార్స్, రీస్ టోప్లే, సామ్ కరన్.