ఇంత మంది కెప్టెన్లు ఎందుకంటూ ప్రశ్న.. రోహిత్ దీటైన ఆన్సర్?
ఇప్పటివరకు ఏకంగా ఏడు సిరీస్లకు ఏడు మంది ఆటగాళ్లు టీమిండియా సారథ్య బాధ్యతలు చేపట్టడం సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే బీసీసీఐ కెప్టెన్సీ విషయంలో ఇలా ఎందుకు వ్యవహరిస్తుంది అన్న విషయంపై కూడా ప్రస్తుతం తీవ్రమైన చర్చ జరుగుతుంది. అయితే అక్టోబర్లో ఆస్ట్రేలియాలో టి20 వరల్డ్ కప్ జరగబోతుంది.. ఇలా వరల్డ్ కప్ కు ముందు ఇలాంటి ప్రయోగాలు అవసరమా అంటూ కొంతమంది మాజీ క్రికెటర్లు అటు బీసీసీఐ తీరుపై విమర్శలు కూడా చేస్తున్నారు. ఇకపోతే ఇటీవల ఇంగ్లాండ్లో టి20 కెప్టెన్సీ వహిస్తున్న రోహిత్ శర్మ కు మీడియా సమావేశంలో ఇక ఇదే విషయం పై ప్రశ్న ఎదురయింది.
ఈ క్రమంలోనే స్పందించిన రోహిత్ శర్మ దీటైన సమాధానం ఇచ్చాడు అని చెప్పాలి. తరచూ నాయకత్వ ఆటగాళ్ల ఎంపిక లో మార్పు జరగడానికి కారణం ఏంటి అని ప్రశ్నించగా.. తీవ్రమైన షెడ్యూల్ కారణంగా ఒక్కోసారి కెప్టెన్సీ లో మార్పులు జరుగుతాయి. టి20 ప్రపంచ కప్ నేపథ్యంలో భారత్ వ్యూహాల్లో ఈ కెప్టెన్సీ మార్పు కూడా భాగమే. బెంచ్ స్ట్రెంత్ కూడా బలంగా ఉండేలా జట్టును తయారు చేసుకుంటున్నాం. మా షెడ్యూల్ పై మాకు అవగాహన ఉంది. ఇలాంటి మార్పు సహజమే. యువ ఆటగాళ్లకు వీలైనన్ని అవకాశాలు వస్తున్నాయి అంటూ ధీటుగా సమాధానం ఇచ్చాడు రోహిత్ శర్మ.