తిలక్ వర్మ తో స్నేహం.. దేవుడిచ్చిన వరం?

praveen
ఈ ఏడాది ముంబై ఇండియన్స్ జట్టు తరపున అవకాశం దక్కించుకున్న తెలుగుతేజం తిలక్ వర్మ ఎంత అద్భుతమైన ప్రదర్శన చేశాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకవైపు ముంబై ఇండియన్స్ జట్టు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న సమయంలో కూడా ప్రతి మ్యాచ్ లోనూ తనదైన ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటూ వచ్చాడు. ఇక తన బ్యాట్తో ప్రతిసారి ఇన్నింగ్స్ నిలబెట్టేందుకు ప్రయత్నించాడు. దీంతో ఇక భారత క్రికెట్ ప్రేక్షకుల చూపు ఆకర్షించి ఒక్కసారి గా గుర్తింపు సంపాదించుకున్నాడు అని చెప్పాలి. అంతేకాదు ముంబై ఇండియన్స్ తరఫున టాప్ స్కోరర్గా కూడా రికార్డు సృష్టించాడు.


 అదే సమయంలో ఇక ఈ ఏడాది ముంబై ఇండియన్స్ జట్టు తరపున అవకాశం దక్కించుకున్నాడు జూనియర్ ఎబి డివిలియర్స్ గా పేరు  సంపాదించుకున్న దక్షిణాఫ్రికా యువ సంచలనం డెవల్ట్ బ్రేవిస్. అతను కూడా మంచి ప్రదర్శన తో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే  తిలక్ వర్మ డెవల్ట్ బ్రేవిస్ మధ్య మంచి స్నేహ బంధం ఏర్పడింది అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవలే స్పోర్ట్స్ క్రీడా తో మాట్లాడిన డెవల్ట్ బ్రేవిస్ ముంబై ఇండియన్స్ జట్టుతో జ్ఞాపకాలను పంచుకున్నాడు. ఇంతకంటే గొప్ప జట్టు ఉంటుందని నేను అనుకోను. ఒక పెద్ద కుటుంబంలో భాగస్వామి అయినందుకు ఎంతో సంతోషంగా ఉంది.


 ఇక దిగ్గజాలతో కలిసి ఆడటం కూడా ఎంతో గొప్ప అనుభవం అంటూ చెప్పుకొచ్చాడు. ఇక హైదరాబాద్ బ్యాటర్ ముంబై ఇండియన్స్  ప్లేయర్ తిలక్ వర్మ తో స్నేహం గురించి చెబుతూ అతని ఫ్రెండ్ షిప్ దేవుడు ఇచ్చిన ఒక గొప్ప గిఫ్ట్ గా భావిస్తాను. అతనితో స్నేహం ఎప్పటికీ గుండెల్లో పదిలంగా ఉంటుంది. ప్రతి క్షణం లో  అతడు నాకు అండగా నిలబడ్డాడు అంటూ డెవల్ట్ బ్రేవిస్ చెప్పుకొచ్చాడు. తమ ఇద్దరికీ కాస్త హాస్యచతురత ఎక్కువ. ఒకరినొకరం ప్రాంక్ చేసుకోవడమే కాదు.. సహచర ఆటగాళ్లు కూడా ఆటపట్టిస్తూ ఉండేవాళ్లం అంటూ తిలక్ వర్మ తో గడిపిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు డెవల్ట్ బ్రేవిస్. మా ఇద్దరి  స్నేహబంధం నా జీవితంలో ఎప్పటికి మర్చిపోలేను అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: