ఇంగ్లాండ్ Vs టీమిండియా.. అత్యధిక రన్స్ చేసింది వీళ్లే?
ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఇప్పటికే రీషెడ్యూల్ చేయబడిన టెస్ట్ మ్యాచ్ ఆడింది టీమిండియా. ఇక ఈ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా కు చేదు అనుభవం ఎదురైంది అన్న విషయం తెలిసిందే. గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోయి చివరికి తీవ్ర నిరాశలో మునిగిపోయింది టీమిండియా ఇక ఇప్పుడు టి20 సిరీస్ ఆడేందుకు సిద్దం అవుతుంది. ఇక టీ20 సిరీస్ మరింత ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. మొదటి టీ20 మ్యాచ్ నేడు రాత్రి పదిన్నర గంటలకు ప్రారంభం కాబోతుంది. సౌతాంప్టన్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది అని చెప్పాలి. అయితే ఇక ఇంగ్లాండ్ ఇండియా మ్యాచ్ అంటే చాలు ప్రేక్షకుల్లో ఉత్కంఠ మరింత పెరిగి పోతూ ఉంటుంది.
బ్యాట్ కి బంతికి మధ్య అత్యుత్తమమైన పోరు జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఎప్పుడు ఎవరు అద్భుతమైన ప్రదర్శన చేసి భారీ స్కోర్లు చేస్తారు అనేది కూడా ఊహకందని విధంగానే ఉంటుంది. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్, టీమ్ ఇండియా మధ్య టి20 మ్యాచ్ లో ఇప్పటివరకు అత్యధిక రన్స్ చేసిన బ్యాట్స్ మెన్స్ ఎవరు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఈ లిస్ట్ లో విరాట్ కోహ్లీ టాప్ లో కొనసాగుతున్నాడు. ఏకంగా ఇంగ్లాండ్ పై 577 పరుగులు చేశాడు. తర్వాత ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ జోస్ బట్లర్ 373 పరుగులతో రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు. మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 347, జేసన్ రాయ్ 325, రోహిత్ శర్మ 317, మహేంద్ర సింగ్ ధోనీ 296 పరుగులతో లిస్టులో ఉన్నారు.