ఐసీసీ ర్యాంకింగ్స్.. అదరగొట్టిన రిషబ్ పంత్?
ఇలా టెస్ట్ మ్యాచ్లలో అదరగొట్టిన రిషబ్ పంత్ ఇటీవలే ఐసీసీ విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్ లో కూడా సత్తా చాటాడు అనే చెప్పాలి. ఏకంగా 801 పాయింట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. టాప్ ఫైవ్ లోకి దూసుకు వచ్చాడు. అంతేకాదు టాప్ టెన్లో ఉన్న భారత ఆటగాళ్లలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఒక్కడికే స్థానం దక్కింది. కరోనా వైరస్ బారినపడి ఇంగ్లాండ్ టెస్ట్ కు దూరమైన రోహిత్ శర్మ ఒక స్థానం దిగజారాడు. 9వ ర్యాంకుకు పడిపోయాడు అని చెప్పాలి. ఇక టెస్ట్ మ్యాచ్లో తీవ్రంగా నిరాశపరిచి విఫలమైన మాజీ కెప్టెన్ కోహ్లీ నాలుగు స్థానాలు దిగజారి 13 వ ర్యాంక్ కు పడిపోయాడు.
అదే సమయంలో టీమిండియాతో ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్లో అదరగొట్టిన ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జో రూట్. 923 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా సెంచరీతో అదరగొట్టిన జానీ బెయిర్ స్టో ఏకంగా 11 స్థానాలు ఎగబాకి 10వ స్థానం సొంతం చేసుకున్నాడు. ఇకపోతే ఇటీవల జరిగిన టెస్ట్ మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ జట్టు భారత్ను ఓడించింది. ఐసీసీ విడుదల చేసిన రాకింగ్స్ లిస్టులో టాప్ 10 లో చోటు దక్కించుకున్న ఆటగాళ్ల లిస్టు చూస్తే..
1. జో రూట్(ఇంగ్లండ్)
2.మార్నస్ లబుషేన్(ఆస్ట్రేలియా)
3.స్టీవ్ స్మిత్(ఆస్ట్రేలియా)
4.బాబర్ ఆజం(పాకిస్తాన్)
5.రిషభ్ పంత్(ఇండియా)
6.కేన్ విలియమ్సన్(న్యూజిలాండ్)
7.ఉస్మాన్ ఖవాజా(ఆస్ట్రేలియా)
8.దిముత్ కరుణరత్నె(శ్రీలంక)
9.రోహిత్ శర్మ(ఇండియా)
10.జానీ బెయిర్‌స్టో(ఇంగ్లండ్).