అయ్యో కోహ్లీ.. అసలు నీకేమైంది?

praveen
టీమిండియా ప్రేక్షకులకు మరోసారి నిరాశే ఎదురైంది. కారణం ఇటీవల ఇంగ్లాండ్లో టెస్ట్ లో భాగంగా టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ లు అందరూ కూడా తక్కువ పరుగులకే వికెట్ చేజార్చుకుని   విఫలమవడమే.  అయితే మిగతా బ్యాట్స్మెన్లు విఫలం అవ్వటం   ఒక ఎత్తు అయితే అటు విరాట్ కోహ్లీ విఫలం అవడం మాత్రం మరో ఎత్తు అని చెప్పాలి. గత కొంత కాలం నుంచి పేలవమైన ఫాంలో కొనసాగుతున్నాడు రన్ మిషన్. ఇక ప్రతి మ్యాచ్ లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగడం స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక వికెట్ చేజార్చుకోవటం చేస్తూ ఉన్నాడు.


 ఈ క్రమంలోనే అతనికి విశ్రాంతి ఇస్తే మళ్లీ పుంజుకుంటాడని బాగా రాణిస్తాడు అని ఎంతో మంది మాజీ ఆటగాళ్లు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఇటీవల బిసిసిఐ కొన్నాళ్లపాటు విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇచ్చింది. కాగా హాలిడేస్ ముగించుకుని ఇటీవలే భారత జట్టుతో చేరిన విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ గడ్డపై అడుగు పెట్టాడు. ఇటీవల జరిగిన వార్మప్  మ్యాచ్లో కూడా అదరగొట్టేశాడు అన్న విషయం తెలిసిందే. రెండు వార్మప్ మ్యాచ్ల్లో హాఫ్ సెంచరీలతో చెలరేగిన పోయాడు. దీంతో ఇక విరాట్ కోహ్లీ ఫుల్ ఫామ్ లోకి వచ్చేశాడు అని అందరూ అనుకున్నారు.


 దాదాపు సెంచరీ కోసం అభిమానులు మూడేళ్ల నుంచి నిరీక్షణలో ఎదురు చూస్తూ ఉండగా.. నిరీక్షణకు కోహ్లీ ఐదవ టెస్ట్ మ్యాచ్లో ఎండ్ కార్డు  వేస్తాడని భావించారు.  కానీ అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి. కోహ్లీ బాగా రాణిస్తాడు అనుకుంటే మరోసారి అదే పేలవ ప్రదర్శనతో నిరాశపరిచాడు. 17 బంతులను ఎదుర్కొని విరాట్ కోహ్లీ కేవలం 13 పరుగులు మాత్రమే చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో అందరూ మళ్లీ నిరాశ లో మునిగిపోయారు అని చెప్పాలి. వార్మప్ మ్యాచ్లో రాణించిన కోహ్లీ ఇక అసలైన టెస్ట్ మ్యాచ్ లో ఎందుకు  రాణించడం లేదు  అన్న కన్ ఫ్యూజన్ లో పడిపోయారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: