హార్దిక్ పాండ్యాకి షాక్.. డీలా పడిన ఫ్యాన్స్?

praveen
మొన్నటి వరకు గాయాల బారినపడి టీమిండియాకు దూరమయ్యాడు స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా.  ఇటీవలే ముగిసిన ఐపీఎల్ లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన  గుజరాత్ జట్టు సారథ్య బాధ్యతలు చేపట్టాడు. హార్థిక్ పాండ్యా కెప్టెన్సీపై ఎవరు ఎలాంటి అంచనాలు పెట్టుకోలేదు. కానీ ఊహించని రీతిలో అద్భుతంగా జట్టును ముందుకు నడిపించిన హార్థిక్ పాండ్య మొదటి ప్రయత్నంలోనే గుజరాత్ జట్టుకు ఐపీఎల్ టైటిల్ అందించాడు. అయితే అతనికి వెంటనే టీమిండియాలో అవకాశం దక్కింది.

 ఈ క్రమంలోనే అటు సౌత్ ఆఫ్రికా భారత్లో పర్యటించిన సమయంలో సిరీస్ ఆడింది. టీ20 సిరీస్ లో కూడా హార్దిక్ పాండ్యా అదరగొట్టాడు. ఆ తర్వాత అనూహ్యంగా భారత జట్టు ఐర్లాండ్  పర్యటనకు వెళ్లగా.. ఇక కెప్టెన్సీ బాధ్యతలను హార్దిక్ పాండ్యాకు అప్పగించింది బీసీసీఐ. కెప్టెన్గా టీమిండియా జట్టును రెండు మ్యాచ్ లలో కూడా గెలిపించి ఐర్లాండ్ ను క్లీన్స్వీప్ చేశాడు హార్దిక్ పాండ్యా. కాగా సీనియర్ ఆటగాళ్లతో కూడిన జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. ఒక టెస్టు మ్యాచ్ అనంతరం వన్డే టి20 సిరీస్ ఆడుతుంది. ఇక టెస్ట్ మ్యాచ్ ఆడబోయే జట్టు ను ప్రకటించి.. టీ20 వన్డే సిరీస్ లు ఆడబోయే జట్టు ప్రకటించకపోవడంతో ఐర్లాండ్ పర్యటనకు వెళ్లిన హార్దిక్ పాండ్యా సారథ్యంలోని జట్టే ఇంగ్లాండ్ లో కూడా టి20 సిరీస్ ఆడుతుందని వార్తలు వచ్చాయి.

 ఈ క్రమంలోనే ఇక ఇంగ్లండ్ పర్యటనలో కూడా హార్థిక్ కెప్టెన్సీ లో  టి20 సిరిస్ జరగబోతుంది అభిమానులు అందరూ ఎంతగానో ఆనంద పడిపోయారు. కానీ ఇటీవలే బీసీసీఐ టి20, వన్డే సిరీస్ లు ఆడబోయే జట్టు వివరాలు ప్రకటించడంతో ఒక్కసారిగా హార్థిక అభిమానులు డీలా పడిపోయారు.
 ఇక బీసీసీఐ ప్రకటించినా జట్టు వివరాలు ఇలా ఉన్నాయి.. రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, దినేష్ కార్తీక్ (వికెట్), హార్దిక్ పాండ్యా, వెంకటేష్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, అక్సర్ పటేల్, రవి బిష్ణో పటేల్ , భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్
రెండు,మూడు టీ20లకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్, దినేష్ కార్తీక్, రిషబ్ పంత్ (వికెట్‌ కీపర్‌), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చహల్ అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్

వన్డేలకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్‌ కీపర్‌), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, యుజువేంద్ చాహల్, అక్షర్‌ పటేల్‌, జస్ప్రీత్‌ బుమ్రా, ప్రసిద్ కృష్ణ, మొహమ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్, ఆర్షదీప్‌ సింగ్‌

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: