వైరల్ : ఔట్ ఇవ్వనందుకు.. అంపైర్ ఎలా దౌర్జన్యం చేసాడో చూడండి?

praveen
సాధారణంగా బౌలర్లు ఎల్బీడబ్ల్యూ కోసం గట్టిగా ఆపిల్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక ఎంతో ఆత్మవిశ్వాసంతో అప్పీల్ చేసిన సమయంలో అంపైర్లు వికెట్ ఇవ్వడం చేస్తూ ఉంటారు. మరి కొన్నిసార్లు ఎంపైర్లు  నాటౌట్గా  ప్రకటిస్తుంటారు. ఇలాంటి సమయంలో ఇక క్రీడాకారులకు ఏదైనా అనుమానాలు ఉంటే వెంటనే రివ్యూ కి  వెళ్లడం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. క్రికెట్ మ్యాచ్లు సాధారణంగానే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం ఒక క్రికెటర్ ఏకంగా అవుట్ ఇవ్వనందుకు అంపైర్   పై దౌర్జన్యం చేశాడు. ఎంతలా అంటే అతని చేతిని పట్టుకుని ఏకంగా అవుట్ అన్నట్లుగా పైకి లేపెందుకు ప్రయత్నించాడు. ఇక ఇలా దౌర్జన్యం చేసిన క్రికెటర్ ఎవరు కాదు పాకిస్థాన్ ఆల్రౌండర్ హసన్ అలీ.

 ఈ క్రీడాకారుడు ఎప్పుడూ వార్తల్లో హాట్ టాపిక్ గా మారి పోతూనే ఉంటాడు అన్న విషయం తెలిసిందే. అయితే గత ఏడాది దుబాయ్ వేదికగా జరిగిన టి20 ప్రపంచ కప్ లో పాకిస్తాన్ నిష్క్రమణ కారణంగా తీవ్ర స్థాయిలో ఎదుర్కొని వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయాడు. ఇప్పుడు  మరోసారి మైదానంలో అతను సరదాగా చేసిన పని అందరినీ అవాక్కయ్యేలా చేసింది. శ్రీలంక పర్యటనకు సిద్ధమవుతున్న పాకిస్థాన్ జట్టు రావల్పిండి వేదికగా ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ ఆడుతుంది. అయితే ఈ మ్యాచ్లో భాగంగా హసన్ అలీ బౌలింగ్ చేస్తున్న సమయంలో ఎల్బిడబ్ల్యు కోసం అంపైర్ దగ్గరికి వెళ్లి గట్టిగా అప్పీల్ చేశాడు.

 కానీ ఫీల్డ్ అంపైర్ మాత్రం  నాటౌట్గా అని ప్రకటించాడు. దీంతో ఇక క్రీజు మధ్యలో నుంచి అంపైర్ వద్దకు పరిగెత్తిన హసన్ అలీ అంపైర్ వేలిని బలవంతంగా పైకి లేపెందుకు ప్రయత్నించాడు. అయితే ఇక హసన్ అలీ అలా చెయ్యడంతో మిగతా ఆటగాళ్లు నవ్వుకున్నారు. అయితే దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంది.  హసన్ అలీ ఇలా ప్రవర్తించడంపై కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫీల్డ్ అంపైర్ పై ఇలాంటి దౌర్జన్యం చేయడం ఏంటి అంటూ ప్రశ్నిస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: