పాత పోరు కొత్తగా.. గెలిస్తే మాత్రం చరిత్రే?

praveen
కీలక పోరుకు రంగం సిద్ధమైంది గతేడాది కరోనా వైరస్ కారణంగా వాయిదా పడినా టెస్ట్ మ్యాచ్ రి షెడ్యూల్ చేయగా.. ఇక ముందుగా అనుకున్న ప్రకారం నేడే మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. ఇంగ్లాండులోని ఎడ్జ్బాస్టన్ వేదికగా మధ్యాహ్నం మూడు గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. కాగా ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా నాలుగు మ్యాచ్ లు పూర్తయ్యేసరికి 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది భారత జట్టు.  ఇక నేటి నుంచి ఐదు రోజుల పాటు జరగబోతున్న టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు గెలిచినా లేదా డ్రాగా ముగిసిన కూడా సిరీస్ భారత్ వశం అవుతుంది అని చెప్పాలి.

 ఒకవేళ ఇంగ్లాండ్ జట్టు గెలిస్తే సిరీస్ 2-2 తో సమం అవుతుంది. అయితే పాత పోరును ప్రస్తుతం కొత్తగా ప్రారంభించేందుకు ఇరు జట్లు కూడా సిద్ధమవుతున్నాయి. ఇక టీమ్ ఇండియా జట్టుకు కెప్టెన్గా జస్ప్రిత్ బూమ్రా వచ్చాడు. అదే సమయంలో ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ గా బెన్ స్టోక్స్ సారథ్య బాధ్యతలు చేపట్టాడు. జట్టులో కూడా ఎన్నో మార్పులు చేర్పులు కూడా జరిగాయి. ఈ క్రమంలోనే పాత పోరు కొత్తగా మొదలవడంతో ఎవరు పైచేయి సాధిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. కెప్టెన్సీలో  ఎలాంటి అనుభవం లేని జస్ప్రిత్ బూమ్రా న్యూజిలాండ్ పై అద్భుతమైన గెలుపుతో ఆత్మవిశ్వాసంతో ఉన్న  ఇంగ్లాండ్ను బోల్తా కొట్టించడం కాస్త కష్టమైన పనే.

 అదే సమయంలో టీమ్ ఇండియా లో ఉన్న మిగతా ఆటగాళ్లు సమిష్టిగా పోరాడేందుకు సిద్ధమవుతున్నారు. ఐదవ టెస్టులో విజయం సాధించి 3-1 తేడాతో ఇంగ్లాండ్ జట్టును టీమిండియా ఓడించింది అంటే చాలు అది సరికొత్త చరిత్ర సృష్టించినట్లు అవుతుంది. ఎందుకంటే 2007 నుండి భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన ద్వైపాక్షిక టెస్టు సిరీస్ లలో టీమిండియా  ఇప్పటివరకు విజయం సాధించలేదు. టీమిండియా ఇప్పటి వరకు 7 సార్లు ఆడితే ఒక్కటి డ్రా చేసుకుని ఆ అన్నింట్లో ఓడిపోయింది. అందుకే ఇప్పుడు గెలిస్తే ఇక మొదటి విజయం నమోదయినట్లు అవుతుంది. తద్వారా చరిత్ర సృష్టిస్తుంది భారత జట్టు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: