మొన్న మిస్సయింది.. కానీ సెంచరీ ముచ్చట తీరుస్తా : సంజూ శాంసన్

praveen
ఎన్నో రోజుల నిరీక్షణ తరువాత ఇటీవలే టీమిండియాలో అవకాశం దక్కించుకున్నాడు సంజు శాంసన్. ఇటీవలే ఐపీఎల్లో ప్రదర్శన ఆధారంగా అతనికి టీమిండియాలో అవకాశాన్ని కల్పించారు సెలెక్టర్లు.  టీమిండియాలో కి సెలెక్ట్ చేశారు కానీ అతనికి తుది జట్టులో చోటు దక్కుతోందో లేదో అని అందరూ అనుమానం వ్యక్తం చేశారు. ఇక ఇలాంటి సమయంలోనే అతనికి అదృష్టం బాగా కలిసొచ్చింది. ఓపెనర్ గాయపడటంతో అతని స్థానంలో జట్టులోకి వచ్చాడు సంజు శాంసన్. ఇక వచ్చిన అవకాశాన్ని ఎంతో బాగా సద్వినియోగం చేసుకున్నాడు అని చెప్పాలి.

 ఇటీవలే ఐర్లాండ్ పర్యటనలో భాగంగా టీమిండియా  రెండో టి-20 మ్యాచ్ లో అవకాశం దక్కించుకున్న సంజూ శాంసన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి అందరిని ఆశ్చర్యపరిచాడు. కేవలం 44 బంతుల్లో 9 ఫోర్లు 4 సిక్సర్లతో 77 పరుగులు చేసి అదరగొట్టేశాడు అని చెప్పాలి. ఐర్లాండ్ బౌలర్లు ఎంత వైవిధ్యమైన బంతులు వేసినప్పటికీ తనదైన శైలిలో విరుచుకుపడి టి 20 ఫార్మాట్ లోనే ఫస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు అని చెప్పాలి. అయితే సంజూ శాంసన్ దూకుడు చూస్తే సెంచరీ సాధించడం పక్క అని అందరూ అనుకున్నారు. కానీ తర్వాత  క్లీన్బౌల్డ్ అయ్యాడు. అయినప్పటికీ అప్పటికే ఇండియాకు భారీ స్కోరు అందించాడు అని చెప్పాలి.

 ఇటీవల తన ప్రదర్శన పై మాట్లాడిన సంజూ శాంసన్  ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నేను దీపక్ హుడా రెచ్చిపోతున్నప్పుడు అతనికి స్ట్రైక్ ఇచ్చాను. ఇక నేను కూడా కుదురు కున్నప్పుడు  అతను అలాగే చేశాడు.  దీపక్ హుడా  సెంచరీ చేసినందుకు ఎంతో సంతోషంగా ఉంది. రాబోయే మ్యాచులలో నేను కూడా సెంచరీ సాధిస్తాను. రెండో టీ20 మ్యాచ్ లో నేను ఆడిన దానికి చాలా సంతోషం గానే ఉన్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇక సంజూ శాంసన్ మాటలు తర్వాత అతని నుంచి సాలిడ్ సెంచరీ రావాలని అభిమానులు కూడా కోరుకుంటూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: