క్రికెట్ ను .. అతను బ్రష్టు పట్టిస్తున్నాడు : పాక్ క్రికెటర్

praveen
ఇటీవలి కాలంలో ఎంతోమంది మాజీ ఆటగాళ్ళు పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై ఇక పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో కీలకంగా వ్యవహరిస్తున్న మాజీ ఆటగాళ్ల పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్. ఇక ఇటీవలే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజా పై ఆ దేశపు మాజీ ఆటగాడు తన్విర్ అహ్మద్ కామెంట్స్ చేశాడు. ఇక అతను చేసిన కామెంట్స్ కాస్త ప్రస్తుతం వైరల్ గా మారిపోయాయ్. అతను పాకిస్థాన్ జట్టు తరఫున ఐదు టెస్ట్ లు, రెండు వన్డేలు ఒక టి20 మ్యాచ్ ఆడాడు. ఇటీవల అతను మాట్లాడుతూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా రమీజ్ రాజా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తవుతుంది. అయినప్పటికీ ఆయన క్రికెట్ కోసం చేసింది ఏమీ లేదు అంటూ విమర్శలు గుప్పించారు.

 నాలుగు దేశాల టోర్నీ గురించి హడావిడి చేస్తున్నాడు తప్ప ఇక ఈ ఏడాది కాలంలో అతను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ గా  మారిన తర్వాత సాధించింది మాత్రం ఏదీ లేదు అని చెప్పాలి. అతను ఇక పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత చేసిన మంచి పని ఏదైనా ఉంటే దాని నిరూపించాలి అంటూ సవాల్ విసిరాడు తన్వీర్. అయితే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పరిస్థితి గత పాలకుల సమయంలో ఎలాగా ఉందో ఇక ప్రస్తుతం కూడా అదే రీతిలో ఉందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇటీవలే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజా వచ్చే ఏడాది పీసీబీ  ప్రణాళికలను వివరించిన నేపథ్యంలో ఇక మాజీ ఆటగాడు తన్విర్ అహ్మద్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

 కాగా ఇటీవలే ప్రెస్మీట్లో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజా మాట్లాడుతూ ఆ దేశ క్రికెట్ బోర్డుకు తన హయం  స్వర్ణయుగం లాంటిదని తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్నో కొత్త ఆవిష్కరణలు చేపట్టినట్లు తెలిపారు. అంతేకాదు పాకిస్తాన్ క్రికెట్ జట్టును కొత్త పుంతలు తొక్కించా అంటూ గొప్పలు చెప్పుకున్నాడు. అయితే పి సి పి వ్యవహరిస్తున్న తీరుపై ఇటీవలే డానిష్ కనేరియా సైతం ప్రశ్నల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ బ్యాట్స్మెన్ అహ్మద్ షాదాబ్ కూడా మాట్లాడుతూ ఎవరైనా ఆటగాడు బాగా రాణిస్తే  సీనియర్లు అసలు సహించలేరు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: