పసికూన ఐర్లాండ్ పై ఇండియా పంజా విసిరేనా ?

VAMSI
ఇండియా క్రికెట్ జట్టు ఐపిఎల్ తర్వాత వరుస సీరీస్ లపై సీరియస్ గా తమ దృష్టిని కేంద్రీకరించింది. ఐపిఎల్ అయిన వెంటనే సౌత్ ఆఫ్రికా తో స్వదేశంలో జరిగిన అయిదు మ్యాచ్ ల టీ 20 సీరీస్ లో వర్షం కారణంగా బెంగుళూరు మ్యాచ్ రద్దు కావడంతో సిరీస్ 2-2 తో ఇటు జట్లు ట్రోపీని అందుకున్నాయి. అయితే మొదటి రెండు మ్యాచ్ లలో ఓడిపోయి... వెంటనే అద్భుతంగా పుంజుకుని సీరీస్ ను సమం చేసింది పంత్ నేతృత్వంలోని టీమ్ ఇండియా. కాగా ప్రస్తుతం ఇంగ్లాండ్ లో ఒక జట్టు మరియు ఐర్లాండ్ లో ఒక జట్టు ఉంది. ఇంగ్లాండ్ తో టెస్ట్ సీరీస్ ఆడనున్న నేపథ్యంలో... సీనియర్ ఆటగాళ్లను ఐర్లాండ్ కు పంపలేదు.
ఇక్కడ ఐర్లాండ్ పర్యటనలో ఇండియా 2 టీ 20 లు ఆడనుంది... ఈ టీమ్ కు ఐపిఎల్ లో గుజరాత్ టైటాన్స్ ను ముందుండి నడిపించి మొదటి సీజన్ లోనే టైటిల్ ను అందించిన హార్దిక పాండ్య ను బీసీసీఐ కెప్టెన్ గా నియమించింది. ప్రస్తుతం ఐర్లాండ్ తో పోటీ పడనున్న జట్టులో ఐపిఎల్ లో రాణించిన రాహుల్ త్రిపాఠి, దీపక్ హూడ, సంజు శాంసన్, దినేష్ కార్తిక్, అవేష్ ఖాన్, ఆర్ష్ దీప్ సింగ్ లాంటి ఆటగాళ్లు ఉన్నారు. అయితే అంది వచ్చిన అవకాశాన్ని వీళ్ళు ఏ విధంగా ఉపయోగించుకుంటారు అన్నది రేపు మ్యాచ్ జరిగిన తర్వాత మాత్రమే తెలుస్తుంది.
అయితే పసికూన ఐర్లాండ్ తో హార్దిక పాండ్య ఏ విధంగా  జట్టును విజయపథంలో నడిపిస్తాడు అన్నది చూడాలి. పసికూన కదా అని లైట్ గా తీసుకుంటే ... సంచలనాలు నమోదు అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి ఐర్లాండ్ తో రేపు జరగనున్న మొదటి టీ 20 లో ఎవరు విజయాన్ని సాధిస్తారు అన్నది చూద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: