అరుదైన ఆటగాడిగా నెదర్లాండ్స్ క్రికెటర్.. రెండు దేశాలకు ఆడాడు?

praveen
సాధారణంగా ఒక క్రికెట్ ప్లేయర్ ఒక దేశ క్రికెట్ జట్టు తరపున ప్రాతినిధ్యం వహించడం సాధ్యమౌతుంది అని అనుకుంటారు చాలామంది.  కానీ కొంతమంది అరుదైన క్రికెటర్లు మాత్రం ఏకంగా రెండు దేశాల క్రికెట్ జట్ల తరపున ప్రాతినిధ్యం వహించడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటి విషయాలు చాలా మందికి తెలియవు అని చెప్పాలి. ఇటీవలే నెదర్లాండ్స్ మాజీ క్రికెటర్ మైకేల్ రిప్పన్ ఇలాంటి అరుదైన ఘనత అందుకున్నాడు. ఇక ప్రపంచ క్రికెట్లో రెండు దేశాలకు ప్రాతినిధ్యం వహించిన అరుదైన క్రికెటర్గా నిలిచాడు.

 ఇన్ని రోజుల వరకు నెదర్లాండ్స్ ప్రాతినిధ్యం వహించిన మైఖేల్ రిప్పన్ ఇకనుంచి న్యూజిలాండ్ తరపున ఆడబోతున్నాడు అన్నది తెలుస్తుంది. యూరోపియన్ టూర్ లో భాగంగా ఐర్లాండ్ నెదర్లాండ్స్ స్కాట్లాండ్ లాంటి అసోసియేట్ దేశాలతో న్యూజిలాండ్ జట్టు సిరీస్ లో ఆడుతుంది. ఈ క్రమంలోనే ఇక ఈ టూర్ లో పాల్గొనే ఆటగాళ్ల వివరాలను ఇటీవలే న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఎంపిక చేసింది. వచ్చే జులై ఆగస్టు నెలల్లో ఇక ఈ వరుస సిరీస్ లు జరుగుతున్నాయని తెలుస్తోంది.  ఈ క్రమంలోనే మొదట ఐర్లాండ్ తో మూడు వన్డేలు, టీ20 సిరీస్ లు ఆడబోతుంది న్యూజిలాండ్ జట్టు.

ఇక ఐర్లాండ్ తో ఇక ఈ సిరీస్ ముగిసిన తర్వాత నెదర్లాండ్స్ తో టి20 వన్డే మ్యాచ్ ఆడబోతుంది. ఇది ముగిసిన తర్వాత నెదర్లాండ్స్ తో ఆడుతుంది. కాగా న్యూజిలాండ్ లో మైకేల్ రిప్పన్ వున్నాడు. సౌత్ ఆఫ్రికాకు చెందిన మైఖేల్ రిప్పన్ కుటుంబ సభ్యులు 2013లో న్యూజిలాండ్ కు వచ్చారు. న్యూజిలాండ్ క్రికెట్ లో ఓనమాలు నేర్చుకుని డచ్ దేశం తరఫున ప్రాతినిధ్యం వహించాడు. 19 వన్డే మ్యాచ్ లు, 21 టి20 మ్యాచ్లు ఆడాడు. ఇప్పుడు న్యూజిలాండ్ తరఫున అడుగుతున్నాడు. మైకేల్ రిప్పన్ నెదర్లాండ్స్ తో వన్డే సిరీస్కు ఎంపిక కాలేదు. కేవలం ఐర్లాండ్, స్కాట్ ల్యాండ్ తో మాత్రమే అడుగుతున్నాడు. ఏదైనా సభ్యులు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాడు ఐసీసీలో పూర్తిస్థాయి జట్టుకు ఆడుకునే అవకాశం ఉంటుంది. ఇలా ఒకసారి పూర్తిస్థాయి జట్టుకు ఎంపికైన ఆటగాడు మూడేళ్లపాటు అసోసియేట్ దేశాలకు దూరంగా ఉండాలని ఐసిసి నిబంధన ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: