వరల్డ్ కప్ జట్టులో దినేష్ కార్తీక్.. ద్రావిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు?

praveen
అక్టోబర్ నెలలో ఆస్ట్రేలియా వేదికగా టి20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ వరల్డ్ కప్ జట్టులో అవకాశం దక్కించుకొబోయే టీమిండియా ఆటగాళ్లు ఎవరు అన్న చర్చ జరుగుతుంది. మరీ ముఖ్యంగా మొన్నటివరకు టీమిండియాకు  దూరంగా ఉండి ఐపీఎల్లో ఇటీవలే అద్భుతంగా రాణించి టీమిండియాలో అవకాశం దక్కించుకున్న దినేష్ కార్తీక్ గురించి ఎక్కువ చర్చ జరుగుతోంది. ఇటీవలే సౌతాఫ్రికా  తో టీ20 సిరీస్ లో కూడా దినేష్ కార్తీక్ అదరగొట్టేశాడు.

 ఈ క్రమంలోనే ఇదే విషయంపై ఇటీవలే టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ క్లారిటీ ఇచ్చాడు. టీమిండియాలో చోటు కావాలంటే తలుపు తట్టడం కాదు బద్దలుకొట్టే ప్రదర్శన చేయాలి అంటూ చెప్పుకొచ్చాడు. తనకు వచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్న దినేష్ కార్తీక్ ఇక టి20 వరల్డ్ కప్ జట్టు ఎంపిక ముందు ఎన్నో ప్రత్యామ్నాయాలను సృష్టించుకున్నాడు అంటూ ప్రశంసలు  కురిపించాడు. ఇక ఇంగ్లాండు టూర్ ముగిసేలోపు టి20 వరల్డ్ కప్ లో చోటు దక్కించుకోబోయే 20 మంది ప్రధాన ఆటగాళ్లు విషయంలో అవగాహనకు రాబోతున్నట్లు రాహుల్ ద్రావిడ్ చెప్పుకొచ్చాడు.

 అయితే టీమిండియా లో దేని కోసం అయితే దినేష్ కార్తీక్  ని ఎంపిక చేశామో.. అతడు తన బాధ్యతలను సమర్థవంతం గా నిర్వహిస్తున్నాడు. రాజ్కోట్లో జరిగిన టి20 మ్యాచ్ లో భారీ ఇన్నింగ్స్ అవసరమైన సమయంలో రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. డెత్ ఓవర్లలో తన బ్యాటింగ్తో ఉతికి ఆరేసాడు. అయితే ఆశించిన స్కోరును అందుకోవాలంటే చివరి ఓవర్లలో ఇక దినేష్ కార్తీక్ లాగ విరుచుకుపడి ఆడే ఆటగాళ్లు ఎంతో అవసరం ఉంది అంటూ రాహుల్ ద్రవిడ్ చెప్పుకొచ్చాడు. టి20 వరల్డ్ కప్ జట్టులో తన పేరును తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలనే పరిస్థితిని దినేష్ కార్తీక్ తీసుకు వచ్చాడని తెలిపాడు రాహుల్ ద్రావిడ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: