గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రాకి.. తప్పిన పెను ప్రమాదం?

praveen
భారత సూపర్ స్టార్ గోల్డ్మెడలిస్ట్ నీరజ్ చోప్రాకి పెను ప్రమాదం తప్పింది అనేది తెలుస్తుంది. ఇటీవల జరిగిన పోటీలలో ఒక్కసారిగా కిందపడిపోయాడు నీరజ్ చోప్రా. దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.  ఫిన్ లాండ్ లో ఇటీవల జరిగిన కుర్తానే గేమ్స్ లో నీరజ్ చోప్రా 86.69 మీటర్ల దూరం జావలిన్ త్రో విసిరి విజేతగా నిలిచాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గోల్డ్ మెడల్ సాధించాడు. అయితే నీరజ్ చోప్రా ఈ గేమ్ లో జావలిన్ త్రో ప్రయత్నాలు రెండు సార్లు పౌస్ చేశాడు.

 ఈ క్రమంలోనే ఒక ప్రయత్నంలో జావలిన్ త్రో విసిరిన అనంతరం తనను తాను నియంత్రించుకోవడంలో విఫలమయ్యాడు నీరజ చోప్రా. ఈ క్రమంలోనే పట్టుతప్పి ఒక్కసారిగా కిందపడిపోయాడు. ఇక అదృష్టవశాత్తు నీరజ్ చోప్రా కి ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు అని చెప్పాలి.  ఇక కింద పడిన తర్వాత వెంటనే పైకి లేచిన నీరజ్ చోప్రా తాను బాగానే ఉన్నాను అంటూ చిరునవ్వుతో సంకేతాలు ఇవ్వడంతో అక్కడున్న వారందరూ కూడా ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఇక ఈ పోటీలు జరగడానికి ముందు అక్కడ మైదానంలో వర్షం కురవడంతో గ్రౌండ్ మొత్తం బురదమయంగా మారిపోయింది.

 అయితే వర్షం ముగిసిన వెంటనే అటు ఆటను ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ ఆటలో భాగంగా మొదట నీరజ్ చోప్రాను జావలిన్ త్రో విసిరాడు. టోక్యో ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన తర్వాత అటు నీరజ్ చోప్రాకి ఇది రెండవ పోటీ కావడం గమనార్హం. ఇక ఈ రెండో పోటీల్లో కూడా విజయం సాధించి స్వర్ణ పథకంతో రికార్డు సృష్టించాడు. అంతేకాదు ఈ పోటీలలో స్వర్ణం  గెలుచుకున్న మొదటి భారతీయుడిగా కూడా  ఒక రికార్డు సృష్టించాడు అని చెప్పాలి. ఇక నీరజ్ చోప్రా కాలు జారి కింద పడిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: